India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ హసన్ గెలుపొందారు. ఆయనకు 63 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికలకు కాంగ్రెస్, BRS దూరంగా ఉండటంతో బీజేపీ, ఎంఐఎం మాత్రమే బరిలో నిలిచాయి. మొత్తం 112 ఓట్లకు గానూ 88 ఓట్లు పోలయ్యాయి.
AP: నంద్యాల జిల్లా దొర్నిపాడులో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. జెడ్పీ హైస్కూల్‌లో చదివి 557 మార్కులు సాధించిన సారా అనే బాలిక ఆ సంతోషాన్ని ఆస్వాదించలేకపోయింది. తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ ఈ నెల 19వ తేదీనే మరణించింది. చనిపోయే ముందు కూడా తనకు 500పైనే మార్కులొస్తాయని చెప్పిందంటూ పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు.
తమిళనాడులోని అరక్కోణంలో పెను ప్రమాదం తప్పింది. రైల్వే పట్టాలపై దుండగులు బోల్టులు తప్పించారు. అధికారుల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బెంగళూరు, కేరళ వెళ్లే రైళ్లను దారి మళ్లించారు. ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడిపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఉగ్రవాదుల్ని, వారిని పెంచి పోషించేవారిని ఒకటే అడుగుతున్నా. గడచిన 78 ఏళ్లుగా మీ పోరాటం ఏం సాధించింది? ఒక్క మిల్లీమీటర్ భూమైనా దక్కిందా? ఇంకో 78వేల ఏళ్లైనా మీరు సాధించేదేమీ లేదు. ఏమీ మారదు. మరి ఎందుకీ హింస? చక్కగా శాంతియుతంగా జీవిద్దాం’ అని సూచించారు.
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు GHMC ప్రధాన కార్యాలయంలో కాసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ ఎన్నికలు ఈ నెల 23న జరిగాయి. 78.57 శాతం పోలింగ్ నమోదైంది. 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎంకు చెందిన 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. BRS కార్పొరేటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మరికాసేపట్లో శ్రీనగర్, ఉదమ్‌పూర్‌కు వెళ్లనున్నారు. అక్కడ ఆర్మీ సీనియర్ కమాండర్లతో ఆయన భేటీ అవుతారు. LoC వద్ద ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీయనున్నారు. తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ద్వివేది వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని శివసేన(ఉద్ధవ్ వర్గం) తమ అధికారిక పత్రిక సామ్నాలో విమర్శించింది. ‘ఆర్టికల్ 370 రద్దు వల్ల కశ్మీర్‌లో ఏం ఒరిగింది? హిందువులపై హింస ఆగిందా? జేమ్స్‌బాండ్‌లా ఫోజులిచ్చే అజిత్ దోవల్ ఏం చేస్తున్నారు? పాక్‌ను బెదిరించినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు. హిందువులపై దాడి జరగగానే పాకిస్థాన్, ముస్లింలపై ఏడవటం బీజేపీకి అలవాటు అయిపోయింది’ అని మండిపడింది.
రాజస్థాన్‌పై RCB సూపర్ విక్టరీకి ఓ రివ్యూ బాటలు వేసింది. RR విజయానికి 12 బంతుల్లో 18 పరుగులు అవసరం ఉండగా హేజిల్‌వుడ్ బౌలింగ్ వేశారు. మూడో బంతిని జురెల్ మిస్సయ్యాడని అందరూ అనుకున్నారు. అంపైర్ కూడా ఆసక్తి చూపలేదు. కీపర్ జితేశ్ మాత్రం రివ్యూ కావాలన్నారు. బంతి బ్యాట్ ఎడ్జ్ తాకినట్టు తేలడంతో జోరుమీదున్న జురెల్(47- 3 సిక్సులు, 3 ఫోర్లు) ఔటయ్యారు. దీంతో మ్యాచ్ RCB చేతిలోకి వచ్చింది.
పహల్గామ్ నరమేధానికి ప్రతీకారంగా భారత్ ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతిస్తామని UK MP బాబ్ బ్లాక్‌మెన్ స్పష్టం చేశారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ మిలిటరీ యాక్షన్ చేపట్టినా తమ దేశంలోని పార్టీలన్నీ సపోర్ట్ చేస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ PM మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ కష్టసమయంలో భారత్‌కు తమ దేశం అండగా ఉంటుందన్నారు.
AP: స్పౌజ్ పెన్షన్లపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2023 డిసెంబర్ నుంచి 2024 అక్టోబర్ మధ్య పెన్షన్ పొందుతూ చనిపోయిన భర్తల స్థానంలో భార్యలకు పింఛన్ ఇవ్వనుంది. ఇందుకు ఇవాళ్టి నుంచి గ్రామ, వార్డు సచివాలయల్లో దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ నెల 30లోపు వివరాలు సమర్పిస్తే మే 1 నుంచి దాదాపు 89వేల మందికి కొత్తగా పెన్షన్ అందనుంది.
Sorry, no posts matched your criteria.