News September 7, 2025

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: వాయవ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

News September 7, 2025

ఐదేళ్లలో 50 వేల మందికి విదేశాల్లో ఉద్యోగాలు: మంత్రి లోకేశ్

image

AP: సీడాప్ ద్వారా వచ్చే ఐదేళ్లలో 50 వేల మందికి విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ నెలలోనే నైపుణ్యం పోర్టల్‌ను ప్రారంభిస్తామన్నారు. అంతర్జాతీయ ప్లేస్ మెంట్ పథకం కింద జర్మనీ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను అభినందించారు. తొలి బ్యాచ్‌లో సీడాప్ ద్వారా మొత్తం 171 మందికి శిక్షణనివ్వగా, ఇప్పటికే వివిధ విభాగాల్లో 40 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు.

News September 7, 2025

రాబోయే 2 గంటల్లో వర్షం

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, ఉమ్మడి కరీంనగర్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, ములుగు, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

News September 7, 2025

భారీగా పెరిగిన బీసీసీఐ బ్యాంక్ బ్యాలన్స్!

image

BCCI (భారత క్రికెట్ బోర్డు) బ్యాంక్ నిల్వలు రూ.20,686 కోట్లకు చేరినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. గత ఐదేళ్లలో బోర్డు ఖజానాలో రూ.14,627 కోట్లు చేరాయని జాతీయ మీడియా పేర్కొంది. కేవలం గత ఆర్థిక సంవత్సరంలోనే రూ.4,193 కోట్లు పెరిగినట్లు తెలుస్తోంది. IPL, ICC డిస్ట్రిబ్యూషన్స్ ద్వారా భారీగా ఆర్జించినట్లు సమాచారం. ఈనెల 28న జరిగే యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో ఈ వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

News September 7, 2025

తాజా సినీ ముచ్చట్లు

image

☛ రాజమౌళి డైరెక్షన్‌లో చేస్తున్న సినిమాలో మహేశ్ బాబు కొన్ని సన్నివేశాల్లో రాముడి గెటప్‌లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
☛ రేపు (సోమవారం) వైజాగ్‌లోని గోకుల్ పార్క్‌లో ‘మిరాయ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఈనెల 12న సినిమా విడుదల
☛ ‘మిరాయ్‌’కు సీక్వెల్ తీసే స్కోప్ ఉంది. సినిమా హిట్ అయితే సీక్వెల్ గురించి ఆలోచిస్తాం: డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని

News September 7, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 7, 2025

సెప్టెంబర్ 7: చరిత్రలో ఈరోజు

image

1925: సినీ నటి భానుమతి జననం (ఫొటోలో ఎడమవైపు)
1951: నటుడు మమ్ముట్టి జననం (ఫొటోలో కుడివైపు)
1976: సంగీత దర్శకుడు భీమవరపు నరసింహారావు మరణం
1983: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల జననం
1986: సినీ నిర్మాత, దర్శకుడు పి.ఎస్.రామకృష్ణారావు మరణం
1991: తెలంగాణ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి మరణం

News September 7, 2025

ఆంధ్రాప్రెన్యూర్స్ పేరు నిలబెట్టండి: సీఎం చంద్రబాబు

image

AP: యువ పారిశ్రామికవేత్తలు కొత్త రంగాల్లోకి అడుగుపెట్టి సత్తా చాటాలని CM చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రస్తుతం నడుపుతున్న సంస్థలను మరింత వృద్ధిలోకి తేవాలని, ఆంధ్రాప్రెన్యూర్స్ అనే పేరు నిలబెట్టాలని అన్నారు. ఎంట్రప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్‌కు చెందిన యువ పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమయ్యారు. ‘సమాజానికి సంపద సృష్టించి సేవలందించండి. అంతర్జాతీయ బ్రాండ్‌గా మన ఉత్పత్తులు తయారు కావాలి’ అని సూచించారు.

News September 7, 2025

ఈ రోజు నమాజ్ వేళలు(సెప్టెంబర్ 7, ఆదివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.50 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.03 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.14 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.39 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.25 గంటలకు
✒ ఇష: రాత్రి 7.38 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 7, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.