News April 12, 2025
మూడు రెట్లు పెరగనున్న ‘ఆటో’ ఎగుమతులు: నీతి ఆయోగ్

ఆటోమోటివ్ కాంపోనెంట్ ఇండస్ట్రీ విలువ 2030 నాటికి ₹12 లక్షల కోట్లకు చేరుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. ఆటోమోటివ్ ఇండస్ట్రీపై ఓ నివేదిక విడుదల చేసింది. ఎగుమతులు ₹1.72L Cr నుంచి 3రెట్లు పెరిగి రూ.5.16L Crకు చేరుతాయని పేర్కొంది. ఆటోమోటివ్ సెక్టార్‌లో ప్రపంచ దేశాలతో భారత్ పోటీపడేలా వ్యూహాత్మక ప్రణాళికలను ప్రతిపాదించింది. వాహన ఉత్పత్తుల్లో చైనా, US, జపాన్ తర్వాత IND 4వ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్‌లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు

<


