News December 15, 2024
బిగ్బాస్ నుంచి అవినాశ్ ఎలిమినేట్

బిగ్బాస్ సీజన్-8 నుంచి కమెడియన్ అవినాశ్ ఎలిమినేట్ అయ్యారు. టాప్-5లో ఉన్న ఆయన ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈ సీజన్ మధ్యలో హౌస్లోకి వచ్చిన అవినాశ్, తన కామెడీతో అందరినీ అలరించారు. ఫినాలే గెస్టుల్లో ఒకరైన కన్నడ నటుడు ఉపేంద్ర హౌస్లోకి వెళ్లి ఆయన్ను బయటకు తీసుకొచ్చారు. కాగా అవినాశ్ గతంలోనూ బిగ్బాస్ కంటెస్టెంట్గా ఉన్నారు.
Similar News
News December 26, 2025
అరటి తోటల్లో కలుపు నివారణ ఎలా?

అరటి తోటల్లో కలుపు నివారణ చాలా ముఖ్యం. దీని కోసం హెక్టారుకు 500 లీటర్ల నీటిలో బుటాక్లోర్ 5లీటర్లు లేదా అలాక్లోర్ 2.5లీటర్ లేదా పెండిమెథాలిన్ 2.5లీటర్లలో ఏదో ఒక మందును కలిపి నాటిన తర్వాత మొదటి తడి ఇచ్చి నేల తేమగా ఉన్నప్పుడు సమానంగా పిచికారీ చేయాలి. దీని వల్ల కలుపు మొలవకుండా అరికట్టవచ్చు. 100 మైక్రానుల మందం కలిగిన పాలిథీన్ మల్చింగ్ షీటును నేలపై పరచి ఆ తర్వాత మొక్కనాటితే కలుపు సమస్యను అధిగమించవచ్చు.
News December 26, 2025
ఈ రాత్రి ఢిల్లీకి సీఎం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రాత్రికి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు CWC సమావేశంలో పాల్గొననున్నారు. ఎల్లుండి హైకమాండ్ పెద్దలతో భేటీ కానున్నారు. అందులో క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై చర్చించనున్నట్లు సమాచారం.
News December 26, 2025
NABARD 44 పోస్టులకు నోటిఫికేషన్

<


