News June 4, 2024
అవినాశ్ రెడ్డికి 2,274 ఓట్ల ఆధిక్యం

AP: కడప పార్లమెంట్ స్థానంలో సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి 2,274 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ టీడీపీ నుంచి భూపేశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే స్థానంలో టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ లీడింగులో ఉన్నారు. అక్కడ వైసీపీ నుంచి విజయానందరెడ్డి బరిలో ఉన్నారు. తిరుపతి బీజేపీ ఎంపీ(SC) అభ్యర్థి వరప్రసాద్ రావు లీడింగులో ఉన్నారు.
Similar News
News December 14, 2025
తిరుపతి ఐఐటీలో ఉద్యోగాలు

ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి ఐఐటీలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వివిధ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నర్సింగ్ ప్రాక్టీషనర్-03, నర్సింగ్ అసిస్టెంట్-03, అంబులెన్స్ డ్రైవర్ 04.. మొత్తం 10 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈనెల 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, జీతం వివరాలకు www.iittp.ac.in చూడండి.
News December 14, 2025
కామారెడ్డి: పోలింగ్ కేంద్రానికి కదులుదాం.. స్వచ్ఛందంగా ఓటేద్దాం

కామారెడ్డి జిల్లాలో రెండో విడత ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఉదయం 7గం.ల నుంచి 1 గం. వరకు పోలింగ్ జరగనుంది. 2వ విడతలో 197 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 1,655 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మొత్తం 197 సర్పంచి స్థానాలకు ఇప్పటికే 44 సర్పంచి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. కాగా మిగతా సర్పంచి స్థానాల్లో, 1,654 వార్డుల్లో పోలింగ్ జరగనుంది.
> GP ఎన్నికల అప్డేట్స్ కోసం Way2Newsను ఫాలో అవ్వండి.
News December 14, 2025
శుభ సమయం (14-12-2025) ఆదివారం

➤ తిథి: బహుళ దశమి రా.8.34 వరకు
➤ నక్షత్రం: హస్త ఉ.10.49 వరకు
➤ శుభ సమయాలు: ఏమీ లేవు
➤ రాహుకాలం: సా.4.30-6.00 వరకు
➤ యమగండం: మ.12.00-1.30 వరకు
➤ దుర్ముహూర్తం: సా.4.25-5.13 వరకు
➤ వర్జ్యం: రా.7.38-9.20 వరకు
➤ అమృత ఘడియలు: రా.6.00-7.42 వరకు


