News April 6, 2024

షర్మిల ‘హంతకుడి’ వ్యాఖ్యలపై స్పందించిన అవినాశ్ రెడ్డి

image

AP: తాను వివేకాను హత్య చేసిన హంతకుడినంటూ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. ‘ఆ కామెంట్స్ వినడానికే భయంకరంగా ఉన్నాయి. మసిపూసి బూడిద జల్లి తుడుచుకోమంటారు. తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. మాట్లాడేవాళ్లు మనుషులైతే, వారిది మనిషి పుట్టుకే అయితే విజ్ఞత, విచక్షణ ఉండాలి’ అని అవినాశ్ మండిపడ్డారు.

Similar News

News April 23, 2025

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

image

TG: ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్‌ను బోర్డు విడుదల చేసింది. మే 22 నుంచి 29 వరకు 2 సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ప్రథమ సంవత్సరం ప‌రీక్షలు ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, సెకండియర్ ఎగ్జామ్స్ మ‌ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వ‌ర‌కు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు జరగనున్నాయి. పూర్తి టైమ్ టేబుల్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News April 23, 2025

రాజ్ కసిరెడ్డిని కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ అధికారుల పిటిషన్

image

AP: లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన రాజ్ కసిరెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. రూ.3200 కోట్ల కమీషన్ల అంశంలో అతడు కీలక నిందితుడని, విచారణలో పూర్తి వివరాలు వెల్లడించలేదని తెలిపారు. డిస్టిలరీల నుంచి కమీషన్లు తీసుకొని ఎవరికి ఇచ్చారో తేల్చాల్సి ఉందని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న కారణంగా వారంపాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు.

News April 23, 2025

నిజామాబాద్‌లో రికార్డ్ టెంపరేచర్

image

TG: రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఎండ ప్రభావం తీవ్రంగా కనిపించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో 45°C కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం CH కొండూరు, మల్కాపూర్‌లో 45.3°C టెంపరేచర్ నమోదైంది. అధిక ఉష్ణోగ్రతలతో పాటు వేడిగాలుల వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారు.

error: Content is protected !!