News June 22, 2024
వివేకా కేసులో అవినాశ్ అరెస్ట్ అవుతారు: ఆదినారాయణ రెడ్డి

AP: ఎన్నికల్లో YCP ఓటమికి చెల్లెలు షర్మిల కూడా కారణమని జగన్ గ్రహించారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. దీంతో షర్మిలతో రాజీ చేయాలని తల్లి విజయమ్మను జగన్ కోరారని తెలిపారు. అయితే జగనే కాంగ్రెస్‌లో చేరాలని షర్మిల చెప్పేశారని పేర్కొన్నారు. త్వరలో వివేకానందరెడ్డి హత్య కేసులో కడప MP అవినాశ్ రెడ్డి అరెస్ట్ అవుతారని పేర్కొన్నారు. వైసీపీ ఎంపీలను BJPలో చేర్చుకునేందుకు పార్టీ సుముఖంగా లేదన్నారు.
Similar News
News October 31, 2025
శివమ్ దూబే ‘అన్‌బీటెన్’ రికార్డుకు బ్రేక్

2019 నుంచి ఆల్‌రౌండర్ శివమ్ దూబే జట్టులో ఉన్న 37 T20Iల్లో భారత్ గెలిచింది. ఇవాళ ఆసీస్ చేతిలో ఓటమితో ఆ లాంగెస్ట్ అన్‌బీటెన్ రికార్డుకు బ్రేక్ పడింది. అలాగే 2021 నుంచి బుమ్రా ఆడిన 24 మ్యాచుల్లో టీమ్ ఇండియా గెలవగా ఇవాళ పరాజయం పాలయ్యింది. ఉగాండాకు చెందిన పస్కల్ మురుంగి(2022-24) 27*, మనీశ్ పాండే(2018-20) 20* రికార్డులు అలాగే ఉన్నాయి.
News October 31, 2025
హార్ట్ ఎటాక్‌ను నివారించే మందుకు FDA అనుమతి

హార్ట్ ఎటాక్, స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించే Rybelsus మందుకు అమెరికన్ FDA ఆమోదం తెలిపింది. ఇది నోటితో తీసుకునే తొలి GLP-1 ఔషధం కావడం గమనార్హం. ప్రస్తుతం టైప్-2 డయాబెటిస్ రోగులు Rybelsusను వాడుతుండగా తాజాగా హృద్రోగులకూ విస్తరించారు. రక్తంలో చక్కెర స్థాయులు, ఆకలిని అదుపులో ఉంచడంతోపాటు గుండెపోటుకు ప్రధాన కారణాలైన రక్తనాళాల వాపు(ఆర్టీరియల్ ఇన్ఫ్లమేషన్), ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను ఇది తగ్గిస్తుంది.
News October 31, 2025
అందుకే బంగ్లాదేశ్‌ను వీడాను: షేక్ హసీనా

తప్పనిసరి పరిస్థితుల వల్లే దేశాన్ని వీడానని బంగ్లాదేశ్ Ex PM షేక్ హసీనా తెలిపారు. తాను అక్కడే ఉండుంటే తనతోపాటు చుట్టూ ఉన్న వాళ్ల ప్రాణాలు ప్రమాదంలో పడేవని చెప్పారు. ‘దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నా. ఆగస్టులో జరిగినది హింసాత్మక తిరుగుబాటు. బంగ్లా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ నాకు మరణశిక్ష విధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అది బూటకపు విచారణ’ అని ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు.


