News April 4, 2024

అవినాశ్ బెయిల్ రద్దు చేయాలి: సీబీఐ

image

వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న MP అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ దస్తగిరి వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు విచారించింది. ఈ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. హైకోర్టు విధించిన షరతులను అవినాశ్ ఉల్లంఘించారని, సాక్షులను ప్రభావితం చేశారని తెలిపింది. అందువల్ల ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని కోరింది. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.

Similar News

News February 4, 2026

భావ వ్యక్తీకరణకు మూలం ‘విశుద్ధ చక్రం’

image

గొంతు భాగంలో ఉండే ఈ చక్రం భావ వ్యక్తీకరణకు మూలం. ఇది సరిగ్గా ఉన్నప్పుడు మాటలో స్పష్టత, సత్యాన్ని పలికే ధైర్యం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ లభిస్తాయి. అస్థిరంగా ఉంటే గొంతు నొప్పి, థైరాయిడ్ సమస్యలు, ఇతరులతో మాట్లాడటానికి భయం కలుగుతాయి. దీనిని ఉత్తేజితం చేయడానికి ‘హం’ మంత్రాన్ని పఠించాలి. ఆకాశం వైపు చూస్తూ ధ్యానం చేయడం, సంగీతం వినడం, పాటలు పాడటం ద్వారా ఈ చక్రంలోని అడ్డంకులను తొలగించుకోవచ్చు.

News February 4, 2026

ఇలాంటి భారత జట్టును గతంలో ఎప్పుడూ చూడలేదు: ధోని

image

టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు భారత జట్టుపై టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి భయంకరమైన జట్టును తాను గతంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. ఎలాంటి సమయంలోనైనా ఒత్తిడిని జయించ గల జట్టుగా టీమిండియా తయారైందని, ఇదే ఊపు కొనసాగిస్తే కచ్చితంగా భారత జట్టు టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

News February 4, 2026

మున్సిపల్ ఎన్నికల బరిలో 12,993 మంది

image

TG: మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. మొత్తంగా 12,993 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టు SEC తెలిపింది. రాష్ట్రంలో 123 పట్టణ స్థానిక సంస్థల్లో 2,996 వార్డులు, డివిజన్లకు ఎలక్షన్ జరగనుంది. దీంతో ప్రతి వార్డుకు సగటున నలుగురు అభ్యర్థుల చొప్పున పోటీ పడుతున్నారు. ఈ నెల 9తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. 11న పోలింగ్ జరుగుతుంది. 13న ఫలితాలు వెల్లడిస్తారు.