News July 24, 2024
శవ రాజకీయాలు మానుకో జగన్: జీవీ

AP: చంద్రబాబు ఢిల్లీ నుంచి నిధులను సాధించుకొస్తే.. జగన్ శవ రాజకీయాలు కోసం ఢిల్లీ వెళ్లారని వినుకొండ MLA జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. ‘తన హయాంలో ఏపీ పరువును జగన్ ఢిల్లీలో తాకట్టు పెట్టారు. అసెంబ్లీలో మొహం చూపించలేకే ఆయన హస్తిన వెళ్లారు. వినుకొండలో వ్యక్తిగత కారణాలతోనే హత్య జరిగింది. గత ప్రభుత్వంలో జరిగిన 256 హత్యలకు ఏం సమాధానం చెబుతారు. జగన్‌కు పదవీ కాంక్ష తప్ప మరో ఆలోచన లేదు’ అని ఫైర్ అయ్యారు.
Similar News
News September 16, 2025
HYD మెట్రోలో సెక్యూరిటీ గార్డులుగా ట్రాన్స్‌జెండర్లు

TG: హైదరాబాద్‌లోని మెట్రో రైళ్లలో ట్రాన్స్‌జెండర్లను సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 20 మంది హిజ్రాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అపాయింట్‌మెంట్ లెటర్స్ అందజేశారు. గార్డుల నియామకాల కోసం 400 మంది దరఖాస్తు చేసుకోగా నైపుణ్యం ఉన్న వారిని ఎంపిక చేసినట్లు వివరించారు. ట్రాన్స్‌జెండర్లు సమాజంలో గౌరవంగా బతకాలనే ఉద్దేశంతోనే ఈ అవకాశం కల్పించినట్లు మంత్రి తెలిపారు.
News September 16, 2025
నోటిఫికేషన్ విడుదల చేసిన APPSC

AP: రాష్ట్రంలో 21 ఉద్యోగాలకు APPSC నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. లైబ్రేరియన్ సైన్స్‌లో జూనియర్ లెక్చరర్ 2, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 1, డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్-2 (టెక్నికల్ అసిస్టెంట్)- 12+1, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్)- 3, హార్టికల్చర్ ఆఫీసర్- 2 పోస్టులు ఉన్నాయి. రేపటి నుంచి అక్టోబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని APPSC తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
News September 16, 2025
అక్రమాస్తుల కేసుల విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

ఏపీ ఏసీబీ నమోదు చేసిన అక్రమాస్తుల కేసుల విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ సెంట్రల్ ఇన్‌వెస్టిగేషన్ యూనిట్‌కి పోలీస్ స్టేషన్ హోదా లేదని 11 FIRలను హైకోర్టు కొట్టివేయగా ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేసులపై విచారణకు, ఛార్జ్‌షీట్‌ల దాఖలుకు అనుమతినిచ్చింది.