News December 1, 2024
ఈ జ్యూస్‌లను తాగకపోవడమే మంచిది: వైద్యులు

పండ్లు తినే బదులు పండ్ల రసాలు, ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ తాగితే సరిపోతుంది కదా? అని కొందరు భావిస్తుంటారు. కానీ, ఈ మూడింట్లో ఏది బెటరో వైద్యులు సూచించారు. ‘ప్యాకేజ్డ్ పండ్ల రసాలలో అధిక మొత్తంలో షుగర్ ఉండటం వల్ల వాటిని సేవించొద్దు. తాజా పండ్ల రసాలు తాగడం వల్ల అధిక మొత్తంలో పండ్లు తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడప్పుడు ఆ జ్యూస్ తాగినా, తాజా పండ్లు తినేందుకే మొగ్గుచూపాలి’ అని డాక్టర్లు తెలిపారు.
Similar News
News March 14, 2026
జనసేన ఆవిర్భావ దినోత్సవం.. చంద్రబాబు శుభాకాంక్షలు

AP: జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘రాష్ట్ర అభివృద్ధిలో, తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జనసేన పోషిస్తున్న పాత్ర అభినందనీయం. ప్రజలకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్ కోసం పని చేస్తున్న జనసైనికులకు, వీరమహిళలకు, నేతలకు శుభాభినందనలు’ అని ట్వీట్ చేశారు.
News March 14, 2026
కల్తీపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్: మంత్రి

AP: పాలు, నెయ్యి, వెన్నలో డిటర్జెంట్, యూరియా, పిండి పదార్థాల వంటి ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కల్తీ పాలు కిడ్నీలు, జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని.. కొనేటప్పుడు FSSAI లోగో, లైసెన్స్ నంబర్ సరిచూసుకోవాలని సూచించారు. ఏదైనా ఫిర్యాదు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1100, 1800 425 3857కు కాల్ చేయాలన్నారు. కల్తీపై అవగాహన పెంచుకోవడం ముఖ్యమని ట్వీట్ చేశారు.
News March 14, 2026
2027 FEB వరకు టీమ్‌ఇండియా షెడ్యూల్ ఇదే

☛ ఈ ఏడాది జూన్ 6-20 వరకు AFGతో 1టెస్ట్, 3 వన్డేలు, ఆ తర్వాతి వారంలో IREతో 3 T20లు
☛ జులై 1-19 ENGతో 3వన్డేలు, 5 టీ20లు, JULY, AUGలో SLతో 3 టీ20లు, 2 టెస్టులు
☛ SEPలో AFGతో 3 టీ20లు, BANతో 3ODIs, 3 టీ20లు, ZIMతో 3 టీ20లు. ☛ SEP 25-OCT 3 ఏషియన్ గేమ్స్, WIతో 3 ODIs, 5 టీ20లు
☛ OCT-DECలో 5 ODIs, 5 టీ20లు, 2టెస్టులు, SLతో 3 ODIs, 3T20Is
☛ 2027 JAN-FEBలో AUSతో 5 టెస్టులు


