News September 23, 2025
PCOS ఉంటే వీటికి దూరంగా ఉండండి

ప్రస్తుతం మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య పీసీఓఎస్. WHO నివేదికల ప్రకారం పదిమందిలో ఇద్దరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే PCOS ఉన్నవారు కొన్నిపదార్థాలకు దూరంగా ఉండాలి. పాలు, పాల ఉత్పత్తులు, సోయా ఉత్పత్తులు ఈస్ట్రోజన్ స్థాయులపై ప్రభావం చూపి నెలసరిని ఆలస్యం చేస్తాయి. మాంసంలో ఉండే ప్రొటీన్లు మంచివే కానీ, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ని పెంచుతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండండి.
Similar News
News September 23, 2025
మైథాలజీ క్విజ్ – 14

1. రామాయణంలో ‘వాలి’ కుమారుడు ఎవరు?
2. వ్యాసుని ద్వారా దాసి కన్న బిడ్డ ఎవరు?
3. అత్రి మహాముని భార్య ఎవరు?
4. కామాఖ్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది?
5. శ్రీరామనవమి ఏ తెలుగు మాసంలో వస్తుంది?
– సమాధానాలు సాయంత్రం 6 గంటలకు
<<-se>>#mythologyquiz<<>>
News September 23, 2025
మండలి నుంచి వైసీపీ వాకౌట్

ఏపీ శాసన మండలి నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. అట్రాసిటీ కేసులపై చర్చ సందర్భంగా ‘మాపై గొడ్డలి వేటు, కోడికత్తి, అమ్మా, చెల్లి కేసులు లేవు’ అని హోం మంత్రి అనిత YCPపై సెటైర్లు వేశారు. దీంతో ఆమె వ్యాఖ్యలకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామంటూ YCP ఎమ్మెల్సీలు బయటికి వెళ్లిపోయారు.
News September 23, 2025
సన్నబియ్యం పంపిణీకి ప్రత్యేక సంచులు

TG: రేషన్ కార్డు ద్వారా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక సంచులను తయారు చేయించింది. ‘రేషన్ కార్డుపై అందరికీ సన్నబియ్యం.. ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం’ అనే కొటేషన్‌ను ముద్రించింది. CM రేవంత్, Dy.CM భట్టి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ ఫొటోలతో వీటిని రూపొందించింది. ఈ బ్యాగుల్లోనే బియ్యాన్ని రేషన్ షాపులకు సరఫరా చేయనుంది. ఇప్పటివరకు వస్తున్న గోనె సంచులు ప్రస్తుతానికి ఆగిపోనున్నాయి.