News November 23, 2024
త్వరలోనే BC కమిషన్కు ‘జాగృతి’ నివేదిక: కవిత

TG: స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం తెలంగాణ జాగృతి BC కమిషన్కు త్వరలో సమగ్ర నివేదిక సమర్పిస్తుందని MLC కవిత వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సరైన కుల సర్వే నిర్వహించి, అణగారిన వర్గాల అవసరాలను తీర్చి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అభిప్రాయపడ్డారు. సామాజిక న్యాయమే దేశ సామాజిక స్వరూపాన్ని బలోపేతం చేస్తుందని ఆమె అన్నారు.
Similar News
News November 18, 2025
ఎన్కౌంటర్స్ మొత్తం ఫేక్: కూనంనేని

మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్లు మొత్తం ఫేక్ అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మావోయిస్టులను చంపుకుంటూ పోవడం మానవ హననమేనని, ఇది జంగిల్ రాజ్ పరిపాలనకు పరాకాష్ట అని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ పోలీసులు ఇందులో పావులుగా మారారని ఆరోపించారు. మాడేరుమిల్లిలో జరిగిన హిడ్మా ఎన్కౌంటర్తో సహా అన్ని ఎన్కౌంటర్లు కట్టుకథలని ఆయన స్పష్టం చేశారు.

ప్రతి కశ్మీరీ ముస్లింను అనుమానించొద్దు: ఒమర్ అబ్దుల్లా

ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్తో సంబంధమున్న అందరినీ కఠినంగా శిక్షించాలని J&K CM ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అదే సమయంలో అమాయక పౌరులను వేధించొద్దన్నారు. ప్రతి కశ్మీరీ ముస్లింని అనుమానించొద్దని నార్త్ జోన్ CMల సమావేశంలో కోరినట్లు చెప్పారు. పేలుళ్ల నేపథ్యంలో కశ్మీరీ పౌరులను టెర్రరిస్టు సింపథైజర్లుగా భావించరాదన్నారు. నౌగామ్ PS పేలుడు బాధితుల్ని ఆయన పరామర్శించారు.