News October 7, 2025

AIలో సత్తా చాటి.. PM చేతుల మీదుగా అవార్డు

image

ఖమ్మం జిల్లాకు చెందిన తాళ్లూరి పల్లవి AI ఆల్‌ ఇండియా ట్రేడ్‌ టాపర్‌గా ఎంపికై ప్రధాని చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. యువతలో స్కిల్‌డెవలప్‌మెంట్, ఉద్యోగ నైపుణ్యాల్ని పెంచేందుకు PM-SETU పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంట్లో భాగంగా అత్యుత్తమ నైపుణ్యం కనపరిచిన విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. పల్లవి AI న్యూట్రిషన్ అసిస్టెంట్‌ను తయారు చేశారు. వ్యక్తిగత డైట్‌ను అందించడంలో ఇది సహకరిస్తుంది.

Similar News

News October 7, 2025

ఇతిహాసాలు క్విజ్ – 28 సమాధానాలు

image

1. రాముడు పాలించినప్పుడు కోసల దేశపు రాజధాని ‘అయోధ్య’.
2. కురుక్షేత్రంలో కర్ణుడి రథసారథి శల్యుడు.
3. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి.
4. వేంకటేశ్వర స్వామితో పాచికలు ఆడింది హథీరాం బావాజీ.
5. తెలంగాణలో బోనాల పండుగను ఆషాడ మాసంలో జరుపుకొంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 7, 2025

TDPతో పొత్తు వద్దు: నడ్డాకు BJP నేత రహస్య లేఖ

image

జూబ్లీహిల్స్‌లో TDPతో పొత్తు సమీకరణాలపై TBJPలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సుహాసినికి చంద్రబాబు కూటమి టికెట్ ఇప్పిస్తారనే ప్రచారంపై ఓ ముఖ్య నేత JP నడ్డాకు లేఖ రాశారని విశ్వసనీయ సమాచారం. ఈ పొత్తుతో రేవంత్‌కు AP CM లాభం చేకూర్చారనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని, ఈ పరిణామం తెలంగాణలో BJP వృద్ధికి అడ్డుగా ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే BJP-PCC ఒకటని BRS ఆరోపిస్తుండటం తెలిసిందే.

News October 7, 2025

ఇకపై పిన్ లేకుండానే UPI పేమెంట్స్‌!

image

UPI పేమెంట్స్‌ చేసేందుకు ఇకపై ఫింగర్‌ప్రింట్, ఫేషియల్ రికగ్నిషన్ ఆప్షన్లూ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. NPCI రేపటి నుంచే ఈ సదుపాయానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉందని ‘రాయిటర్స్’ పేర్కొంది. UPI చెల్లింపులకు పిన్‌తో పాటు ఇతర ఆప్షన్లు కూడా ఉండాలని గతంలో RBI సూచించింది. ఈ నేపథ్యంలోనే ఉడాయ్ డేటాబేస్‌లో ఉన్న బయోమెట్రిక్ వివరాలను NPCI దీనికి ఉపయోగించుకోనుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.