News March 19, 2025
చేనేత కార్మికులకు అవార్డులు.. దరఖాస్తు ఇలా

TG: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు ‘కొండా లక్ష్మణ్ బాపూజీ’ పేరుతో అవార్డులు ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 నాటికి చేనేతలుగా 30yrs వయసు, పదేళ్ల అనుభవం, చేనేత డిజైనర్లుగా 25yrs వయసు, ఐదేళ్ల అనుభవం ఉన్నవారు అర్హులు. ఏప్రిల్ 15లోగా ఆయా జిల్లా చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులకు దరఖాస్తులను సమర్పించాలి. పూర్తి వివరాలకు https://handtex.telangana.gov.in/ చూడండి.
Similar News
News December 9, 2025
భారత్లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడి

ఆసియాలోనే తమ అతిపెద్ద పెట్టుబడి భారత్లో పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించారు. ఇండియాలో AIకి ఊతమిచ్చేలా 17.5 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు ట్వీట్ చేశారు. ప్రధాని మోదీతో ఉన్న ఫొటోను షేర్ చేసిన ఆయన.. దేశంలో AI అభివృద్ధికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్స్ కోసం ఈ నిధులను వినియోగించనున్నట్లు తెలిపారు.
News December 9, 2025
అయ్యప్ప భక్తులకు కేరళ అటవీశాఖ అలర్ట్

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ అటవీశాఖ అలర్ట్ జారీ చేసింది. అయ్యప్ప ఆలయానికి సమీపంలో ఉన్న ఉరక్కుళి జలపాతం వద్దకు వెళ్లొద్దని సూచించింది. ఇటీవల ప్రమాదాలు ఎక్కువగా జరగడం, ఏనుగులు, వన్యప్రాణుల సంచారం కూడా పెరగడం, ఆ మార్గం ఏటవాలుగా, జారుడుగా ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా ఈ సూచనలు చేసింది. సాధారణంగా అడవిలో నడుచుకుంటూ వెళ్లే భక్తులు ఈ జలపాతం వద్ద ఆగి స్నానాలు ఆచరిస్తారు.
News December 9, 2025
రాయ్బరేలిలో ‘ఓట్ చోరీ’తో గెలిచిన ఇందిరా గాంధీ: బీజేపీ MP

భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానించిందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబె విమర్శించారు. రాయ్బరేలిలో ఇందిరా గాంధీ ‘ఓట్ చోరీ’తోనే గెలిచారని ఆరోపించారు. తాను RSS నుంచి వచ్చినందుకు గర్వపడుతున్నానని చెప్పారు. లోక్సభలో ఎలక్షన్ రిఫామ్స్పై జరుగుతున్న చర్చలో RSS, ‘ఓట్ చోరీ’పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను దూబె తిప్పికొట్టారు.


