News August 31, 2024
ఎక్కువ మొక్కలు నాటితే అవార్డులు: సీఎం
AP: ఇకపై ఎక్కువ మొక్కలు నాటిన వారికి ఆగస్టు 15, జనవరి 26న అవార్డులు ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. మంగళగిరిలో వన మహోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది నుంచే ఇది అమల్లోకి వస్తుందన్నారు. తనకు ఎంతో ఇష్టమైన కార్యక్రమం వన మహోత్సవమని చెప్పారు. మరోవైపు భూగర్భ జలాలు పెరగాలంటే ఇంకుడు గుంతలు తవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
Similar News
News February 1, 2025
4 స్కీమ్స్.. ఎల్లుండి నుంచి ఖాతాల్లోకి డబ్బులు
TG: గత నెల 26న ప్రారంభించిన 4 పథకాలను గ్రామాల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈనెల 3 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. ఇప్పటికే 563 గ్రామాల్లో ఈ స్కీమ్స్ను ప్రారంభించింది. మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు 40 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. మార్చి 31లోగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
News February 1, 2025
రాష్ట్రంలో ఉక్కపోత షురూ
AP: రాష్ట్రంలో రెండు రోజులుగా ఉక్కపోత మొదలైంది. కర్నూలు జిల్లా ఆదోనిలో నిన్న 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. వాతావరణ మార్పుల కారణంగా ఫిబ్రవరిలోనే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తెలిపింది. మరోవైపు 2024 మాదిరే 2025 కూడా అత్యంత వేడి సంవత్సరంగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
News February 1, 2025
బహిరంగంగా దూషణ జరిగితేనే SC, ST కేసు: సుప్రీంకోర్టు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నేర నిరూపణ జరగాలంటే బహిరంగంగా దూషించినట్లు నిరూపించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక కేసుకు సంబంధించి నాలుగు గోడల మధ్య జరిగిందని ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై కోర్టు విచారించింది. అందరూ చూస్తుండగా ఘటన జరగలేదంటూ కోర్టు కొట్టివేసింది. సెక్షన్ 3(1)(ఎస్) నిరూపితం కావాలంటే ఎస్సీ, ఎస్టీ వ్యక్తులను కులం పేరుతో బహిరంగంగా దూషించి ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది.