News October 25, 2024
యూట్యూబ్ నుంచి అదిరిపోయే ఫీచర్

యూట్యూబ్ మరో సరికొత్త ఫీచర్ను భారత్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. కంటెంట్ క్రియేటర్ల కోసం షాపింగ్ అఫ్లియేట్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. దీని ద్వారా అర్హులైన వారు వీడియోలు, షార్ట్స్ ద్వారా నేరుగా మింత్రా, ఫ్లిప్కార్ట్ రిటైలర్ సైట్ల నుంచి అవసరమైన ఉత్పత్తులు కొనుగోలు చేసేలా అనుమతి ఇస్తుంది. ఇది కంటెంట్ క్రియేటర్లకు, వ్యూయర్లకు మధ్య కనెక్షన్ను బలపరుస్తోందని యూట్యూబ్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
Similar News
News December 14, 2025
ప్రకాశంలో నవోదయకు పరీక్షకు 1998 మంది గైర్హాజరు

ప్రకాశం జిల్లాలో శనివారం నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షకు 1998 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఒంగోలు నవోదయ ప్రిన్సిపాల్ శివరాం తెలిపారు. ఒంగోలులోని నవోదయ విద్యాలయ వద్ద ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో నవోదయ ఆరో తరగతి ప్రవేశపరీక్ష పకడ్బందీగా నిర్వహించామన్నారు. మొత్తం 5,502 మంది విద్యార్థులకు గాను, 3,504మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు.
News December 14, 2025
టుడే టాప్ స్టోరీస్

* AP CM చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు కొట్టివేత
* కేంద్ర మాజీమంత్రి కుసుమ కృష్ణమూర్తి(85) గుండెపోటుతో కన్నుమూత
* మెస్సీ టీమ్పై గెలిచిన CM రేవంత్ జట్టు
* ₹21000 CRతో యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం: పొంగులేటి
* సంక్రాంతికి SEC నుంచి ప్రత్యేక రైళ్లు.. రేపు ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్
* ₹6,74,920 కోట్లతో రైల్వే లేన్లు: అశ్వినీ వైష్ణవ్
* దేశంలో రోడ్డు లింక్ లేని గ్రామాలు 40547: కేంద్రం
News December 14, 2025
Kerala: కమ్యూనిస్టులకు ఎదురుదెబ్బ!

కేరళ స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాల హవా కనిపించింది. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని అధికార LDFకు ఈ ఫలితాలు షాకిచ్చాయి. UDF(కాంగ్రెస్) బలం పుంజుకుంది. 6 కార్పొరేషన్లలో 4, 86 మున్సిపాలిటీల్లో 54, 941 పంచాయతీల్లో 504 స్థానాలను గెలుచుకుంది. LDFకు ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. మరోవైపు <<18552178>>తిరువనంతపురం<<>> కార్పొరేషన్లో NDA గెలిచింది. దీంతో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలకు షాక్ తప్పదనే చర్చ సాగుతోంది.


