News November 28, 2024
10 రోజుల ముందుగానే ‘అయోధ్య’ వార్షికోత్సవం.. కారణమిదే
యూపీలోని అయోధ్యలో వచ్చే ఏడాది జనవరి 11వ తేదీనే రామాలయ వార్షికోత్సవాలు నిర్వహించేందుకు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరగగా, 10 రోజుల ముందుగానే వార్షికోత్సవం నిర్వహించడానికి ఓ కారణం ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్య శుక్ల ద్వాదశి(కూర్మ ద్వాదశి) నాడు వేడుక నిర్వహించాలి. 2025లో ఈ తిథి జనవరి 11నే రావడంతో ఆ రోజే వేడుకలు జరగనున్నాయి.
Similar News
News November 28, 2024
BREAKING: మోదీని చంపుతామని మహిళ బెదిరింపులు
ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ మహిళ ఫోన్ చేసి ప్రధాని మోదీపై బెదిరింపులకు పాల్పడింది. ఆయనను చంపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం ఆయుధం కూడా సిద్ధంగా ఉందని వెల్లడించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 28, 2024
ముగిసిన పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఢిల్లీ నుంచి ఆయన విజయవాడ బయల్దేరారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం అయ్యారు. జల్ జీవన్ మిషన్ అమలు, టూరిజం పాలసీ, ఎర్ర చందనం, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి పలు కీలక అంశాలపై వారితో చర్చించారు.
News November 28, 2024
లొకేషన్ హిస్టరీ కావాలా? త్వరగా సేవ్ చేసుకోండి!
నిర్ణీత సమయం తర్వాత Google Mapsలోని హిస్టరీని ఆటోమేటిక్‌గా తొలగించనున్నట్లు యూజర్లకు Google ఈ-మెయిళ్లు పంపుతోంది. చివరి 3 నెలల టైమ్‌లైన్ లొకేషన్‌ను తొలగించనున్నట్లు తెలిపింది. లొకేషన్ హిస్టరీ కావాలనుకున్న యూజర్లు తమ డివైజ్‌లలో మాన్యువల్‌గా/క్లౌడ్ నెట్‌వర్క్‌లో బ్యాకప్‌గా సేవ్ చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం గూగుల్ లొకేషన్ సర్వీసెస్‌లోకి వెళ్లి ఎక్స్పోర్ట్ యువర్ లొకేషన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.