News April 9, 2025

వచ్చే నెలలో అయోధ్య రాముడికి పట్టాభిషేకం

image

అయోధ్యలో వచ్చే నెలలో శ్రీరామచంద్రుడి పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నెలాఖరులోగా ఆలయంలోని మొదటి అంతస్తులో రామ దర్బార్‌ను ఏర్పాటు చేయనున్నారు. దర్బారుకు సంబంధించిన పాలరాతి విగ్రహాలను జైపూర్‌లో శిల్పి ప్రశాంత్ పాండే తీర్చిదిద్దుతున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి. పట్టాభిషేకానికి పరిమితంగా మాత్రమే అతిథుల్ని ఆహ్వానించనున్నట్లు సమాచారం.

Similar News

News April 17, 2025

గిట్టుబాటు ధర లేదు.. ఉపాధి కూలీలకు డబ్బు చెల్లించట్లేదు: బొత్స

image

AP: కూటమి నేతల మాటలకు, చేతలకు పొంతన లేదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. అధికార పార్టీ నేతలు డబ్బు డిమాండ్ చేస్తుండటంతో పరిశ్రమలు వెనక్కిపోతున్నాయని ఆరోపించారు. గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు అల్లాడిపోతున్నారని, ఉపాధి కూలీలకూ డబ్బులు చెల్లించట్లేదని ఫైరయ్యారు. 10 నెలల్లో ఒక్కరికైనా కొత్తగా పెన్షన్ ఇచ్చారా? అని నిలదీశారు. హామీలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

News April 17, 2025

ఈ నెల 24న OTTలోకి ‘L2: ఎంపురాన్’

image

పృథ్వీరాజ్ సుకుమారన్ స్వీయ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ‘L2: ఎంపురాన్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. ఈ నెల 24 నుంచి మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ.270 కోట్ల కలెక్షన్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. అలాగే మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.

News April 17, 2025

రేపు హాల్ టికెట్లు విడుదల

image

AP: పలు ఉద్యోగ పరీక్షల హాల్‌టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు APPSC ప్రకటించింది. అభ్యర్థులు https://psc.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఈ నెల 28న, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ జాబ్స్‌కు 28, 29న పరీక్షలు జరుగుతాయి. ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు 28న పేపర్-1, 30న పేపర్-2, పేపర్-3 ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.

error: Content is protected !!