News February 7, 2025
అయోధ్య ఆలయ దర్శన సమయం మార్పు

అయోధ్య రాముడి దర్శనం ఉదయం 6గంటల నుంచే ప్రారంభించనున్నట్లు శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. ఇప్పటి వరకూ ఉదయం 7గంటలకు ఆలయాన్ని తెరుస్తుండగా.. భక్తులు అధికంగా వస్తుండటంతో దర్శన సమయాలు మార్చినట్లు తెలిపారు. రాముల వారికి ఉదయం 4గంటలకు మంగళహారతి, 6గంటలకు ‘శ్రింగార్ హారతి’ ఇచ్చిన అనంతరం ఆలయాన్ని తెరుస్తారు. రాత్రి పదిగంటల వరకూ స్వామివారిని దర్శించుకోవచ్చు.
Similar News
News November 28, 2025
ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికెట్ కాదు: UP

ఆధార్ కార్డు విషయంలో అన్ని విభాగాలకు ఉత్తర్‌ప్రదేశ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కీలక ఆదేశాలిచ్చింది. ఇకపై ఆధార్ కార్డును బర్త్ సర్టిఫికెట్‌గా, ప్రూఫ్ ఆఫ్ బర్త్‌గా గుర్తించడానికి వీల్లేదని పేర్కొంది. ‘ఆధార్‌కు జనన ధ్రువీకరణ పత్రం జత చేయరు. కాబట్టి ఇకపై దానిని బర్త్ సర్టిఫికెట్‌గా గుర్తించేందుకు వీల్లేదు’ అని ప్లానింగ్ విభాగం ప్రత్యేక కార్యదర్శి అమిత్ సింగ్ బన్సాల్ ఆదేశాలు జారీ చేశారు.
News November 28, 2025
శరవేగంగా అమరావతి పనులు: మంత్రి లోకేశ్

AP: రైతుల త్యాగ ఫలితమే అమరావతి అని మంత్రి లోకేశ్ చెప్పారు. గత ప్రభుత్వం దీన్ని విధ్వంసం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. 3 రాజధానులు అని చెప్పి ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అనే నినాదంతో 1,631 రోజులపాటు రైతులు ఉద్యమం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి’ అని తెలిపారు.
News November 28, 2025
WPL వేలంలో అదరగొట్టిన తెలుగమ్మాయిలు

WPL 2026 వేలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్లేయర్స్ సత్తా చాటారు. గొంగడి త్రిషను రూ.10 లక్షలకు యూపీ వారియర్స్, మమతను రూ.10 లక్షలకు ఢిల్లీక్యాపిటల్స్, క్రాంతిరెడ్డిని రూ.10 లక్షలకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్నాయి. అరుంధతి రెడ్డిని రూ.75 లక్షలకు RCB జట్టు ఎంచుకుంది. ఇటీవలి వన్డే వరల్డ్ కప్ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన నల్లపు రెడ్డి శ్రీచరణిని రూ.1.30 కోట్లతో ఢిల్లీ తిరిగి సొంతం చేసుకుంది.


