News October 30, 2024
ఆయుష్మాన్ భారత్ పెద్ద స్కాం: ఆప్
ఆయుష్మాన్ భారత్లో ఢిల్లీ చేరకపోవడాన్ని PM మోదీ తప్పుబట్టడంపై ఆప్ స్పందించింది. BJP పాలిత రాష్ట్రాల్లో ఈ పథకం పెద్ద స్కాం అని MP సంజయ్ సింగ్ విమర్శించారు. ఇందులోని నిబంధనల వల్ల ఒక్క ఢిల్లీ వ్యక్తికి కూడా పథకం వర్తించదన్నారు. ఫ్రిడ్జ్, స్కూటర్ ఉన్నా, ₹10 వేలకు పైగా ఆదాయం ఉంటే పథకం లబ్ధిపొందలేరని పేర్కొన్నారు. దర్యాప్తు జరిపితే పథకంలోని నిర్వహణ లోపం బయటపడుతుందన్నారు.
Similar News
News October 30, 2024
మెడికల్ కాలేజీకి యల్లాప్రగడ పేరు: పవన్
AP: రాష్ట్రంలోని ఏదైనా మెడికల్ కాలేజీకి ప్రముఖ వైద్య శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు పేరు పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన CM చంద్రబాబుకు పూర్తి వివరాలు పంపారు. ‘సుబ్బారావు భీమవరంలో పుట్టి, రాజమండ్రిలో చదువుకున్నారు. కాబట్టి ఏలూరు, రాజమండ్రిలోని ఏదైనా ఒక కళాశాలకు ఆయన పేరు పెడితే సముచితంగా ఉంటుంది. సీఎం స్పందించి ఈ ప్రతిపాదనను పరిశీలించాలి’ అని ఆయన పేర్కొన్నారు.
News October 30, 2024
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్
TG: ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి సందర్భంగా 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది 2022 జులై 1 నుంచి వర్తిస్తుందని తెలిపింది. పెరిగిన డీఏను నవంబర్ జీతంతో కలిపి ఇవ్వనుంది. 2022 జులై నుంచి 2024 అక్టోబర్ 31 వరకు ఉన్న డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నారు.
News October 30, 2024
‘జై హనుమాన్’ హీరో ఈయనే..
‘జై హనుమాన్’లో హీరోగా రిషబ్ శెట్టి నటించనున్నారు. హనుమంతుడి పాత్రలో ఆయన రాముడి విగ్రహాన్ని హత్తుకున్న ఫస్ట్ లుక్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ దీపావళిని ‘జై హనుమాన్’ నినాదంతో మొదలుపెడదామని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. కాగా ‘హనుమాన్’ మూవీ హిట్ కావడంతో జై హనుమాన్పై ఫ్యాన్స్కు భారీ అంచనాలున్నాయి. హనుమాన్లో హీరోగా తేజా సజ్జ నటించిన విషయం తెలిసిందే.