News June 21, 2024

సభాపతిగా అయ్యన్నపాత్రుడు.. సభకు రాకూడదని వైసీపీ నిర్ణయం

image

స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని YCP నిర్ణయించింది. సభాపతిగా ఎన్నికైన వ్యక్తిని అధికార, విపక్ష నేతలు స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం సంప్రదాయంగా వస్తోంది. అయితే జగన్ రేపు వ్యక్తిగత పర్యటన కోసం పులివెందులకు వెళ్లనున్నారు. కాగా ‘జగన్ ఓడిపోయాడు కానీ <<13442979>>చావలేదు<<>>’ అని అయ్యన్నపాత్రుడు, ఓ వ్యక్తి 2 రోజుల క్రితం సంభాషించుకున్నారు. ఈ వ్యాఖ్యల వల్లే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Similar News

News November 23, 2025

సూర్యాపేట: గుడిపాటి నరసయ్య రాజకీయ నేపథ్యం

image

సూర్యాపేట DCC అధ్యక్షుడిగా గుడిపాటి నరసయ్య నియమితులయ్యారు. తుంగతుర్తి(M) వెలుగుపల్లికి చెందిన ఈయన 1990-95 వరకు PPIML చండ్ర పుల్లా రెడ్డి నక్సల్ గ్రూప్‌లో పనిచేశారు. 2001-6 వరకు ZPTCగా, 2006-08 వరకు కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2009లో MLAగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో టికెట్ ఆశించినా దక్కలేదు.

News November 23, 2025

కుజ దోషం తొలగిపోవాలంటే?

image

కుజ దోష ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ‘ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహీ.. తన్నో అంగారక ప్రచోదయాత్’ అనే గాయత్రి మంత్రాన్ని పఠించాలని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించాలని చెబుతున్నారు. సమీపంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో మంగళవారం రోజున దాన ధర్మాలు చేయడం, హనుమంతుడిని పూజించడం ఎంతో మంచిదని అంటున్నారు.

News November 23, 2025

కేజీ రూపాయి.. డజను రూ.60!

image

AP: మూడేళ్లుగా టన్ను <<18336571>>అరటి<<>> రూ.25వేలు పలకగా ఈసారి రూ.1,000లోపు పడిపోవడంతో రాయలసీమ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేజీకి రూపాయి మాత్రమే వస్తోంది. కిలోకి 6, 7 కాయలు వస్తాయి. 2 కేజీలు అంటే డజను. బయట మార్కెట్లో వ్యాపారులు డజను అరటి రూ.40-60కి అమ్ముతున్నారు. ఈ లెక్కన రైతుకు రూ.2 మాత్రమే వస్తున్నాయంటే వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లోపం ఎక్కడ ఉంది? COMMENT.