News June 4, 2024
ఏడోసారి MLAగా గెలిచిన అయ్యన్నపాత్రుడు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజక వర్గం నుంచి టీడీపీ అభ్యర్థి అయ్యన్నపాత్రుడు ఘనవిజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి పి. ఉమాశంకర్ గణేష్‌పై 23,860కి పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1983లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అయ్యన్న.. ఇప్పటి వరకు 10 సార్లు MLAగా పోటీ చేశారు. 7 సార్లు గెలుపొందారు. గత ఎన్నికల్లో YCP అభ్యర్థి గణేష్ చేతిలో 22,839 ఓట్ల తేడాతో అయ్యన్న ఓటమిపాలయ్యారు.
Similar News
News October 27, 2025
వాహనదారులూ.. ఇది తప్పక తెలుసుకోండి!

మీరు నడిపే వాహనం టైర్లకు సంబంధించిన గరిష్ఠ వేగ పరిమితిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. టైర్‌పై రాసి ఉన్న కోడ్‌లోని చివరి అక్షరం దాని వేగ పరిమితిని సూచిస్తుంది. L ఉంటే 120kmph, N- 140kmph, P- 150kmph, Q- 160kmph, R- 170kmph, S- 180kmph, T- 190kmph, H- 210kmph, V- 240kmph, W- 270kmph, Y- 300kmph వేగం వరకే వెళ్లాలి. లిమిట్‌ను మించి వేగంగా ప్రయాణిస్తే టైర్ పేలిపోయే ప్రమాదం ఉంది. SHARE IT
News October 27, 2025
ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

AP: ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్(మార్చి 2026) ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి భరత్ గుప్తా పేర్కొన్నారు. ఈనెల 22తో ఆ గడువు ముగియగా తాజాగా పొడిగించారు. లేటు ఫీజు రూ.1,000తో నవంబర్ 6వ తేదీవరకు చెల్లించవచ్చని వివరించారు. మరోసారి ఫీజు చెల్లింపు గడువు పొడిగించేది లేదని స్పష్టం చేశారు.
News October 27, 2025
గిరిజనులకు 89,845 దోమతెరలు: సత్యకుమార్

AP: అల్లూరి, మన్యం జిల్లాల్లో మలేరియా ఇతర జ్వరాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 743 గ్రామాల్లోని గిరిజన కుటుంబాలకు 89,845 దోమతెరలను ఉచితంగా అందిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. దీనివల్ల 2 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇందుకు రూ.2.30 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. దోమలను సంహరించే మందును ఉపయోగించి తయారు చేసే ఈ దోమతెరలను 4 ఏళ్లవరకు వినియోగించొచ్చని తెలిపారు.


