News January 14, 2025
అయ్యప్పకు తిరువాభరణాలు అలంకరించి..

శబరిమల కొండల్లో మకరజ్యోతి సాక్షాత్కారమైంది. అంతకుముందు పందళ రాజవంశీయులు తిరువాభరణాలతో సన్నిధానానికి చేరుకొని మణికంఠుడికి సమర్పించారు. పూజారులు వాటిని అయ్యప్పకు అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత స్వామి సన్నిధి తలుపులు తెరుచుకోగానే మరోవైపు మకరజ్యోతి దర్శనమిచ్చింది. దీంతో భక్తులంతా జ్యోతిని దర్శించుకొని పులకించిపోయారు.
Similar News
News January 16, 2026
282 పోస్టులు.. అప్లై చేశారా?

CSI ఈ గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ 282 ఆధార్ సూపర్ వైజర్/ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జిల్లా కేంద్రాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో ఏపీలో 4, తెలంగాణలో 11 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్+ITI, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cscspv.in
News January 16, 2026
కనుమ – ముక్కనుమ: తేడాలేంటి?

నేడు కనుమ. రేపు ముక్కనుమ. ఈ పండుగలు పల్లె సంస్కృతికి అద్దం పడతాయి. కనుమ నాడు వ్యవసాయానికి చేదోడుగా నిలిచే పశువులను పూజించి కృతజ్ఞతలు తెలుపుతారు. ఇక ముక్కనుమ పండుగ ముగింపు సంబరం. ఈరోజున పశువులను చెరువులలో శుభ్రంగా కడిగి విశ్రాంతినిస్తారు. కనుమ రోజున శాకాహారానికి ప్రాధాన్యత ఉంటే, ముక్కనుమ నాడు మాంసాహార విందులు, గ్రామ దేవతల ఆరాధన, బొమ్మల నోము వంటి కార్యక్రమాలతో పండుగకు ఘనంగా ముగింపు పలుకుతారు.
News January 16, 2026
NTR ‘డ్రాగన్’ మూవీలో అనిల్ కపూర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ‘డ్రాగన్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ చేరారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇన్‌స్టా వేదికగా ధ్రువీకరించారు. అనిల్ కపూర్ రాకతో మూవీ హైప్ అమాంతం పెరిగింది. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2026లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


