News April 9, 2024
పాకిస్థాన్ హెడ్ కోచ్‌గా అజహర్
పాకిస్థాన్ హెడ్ కోచ్‌గా ఆ దేశ మాజీ ఆటగాడు అజహర్ మహమూద్ ఎంపికయ్యారు. ఈ నెల 18 నుంచి న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు ఆయన కోచ్‌గా పనిచేయనున్నారు. కాగా అజహర్ పాక్ తరఫున 164 మ్యాచ్‌లు ఆడి 162 వికెట్లు పడగొట్టారు. అలాగే బ్యాటింగ్‌లో 2421 పరుగులు చేశారు. గతంలో పాక్ బౌలింగ్ కోచ్‌గా కూడా విధులు నిర్వర్తించారు. కాగా అజహర్ ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు 23 మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించారు.
Similar News
News January 10, 2025
‘గేమ్ ఛేంజర్’ రివ్యూ&రేటింగ్
నిజాయితీ గల ఆఫీసర్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపిస్తాడనేదే ‘గేమ్ ఛేంజర్’ స్టోరీ. సామాజిక కార్యకర్తగా, IASగా రామ్ చరణ్ మెప్పించారు. SJ సూర్య యాక్టింగ్, ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్. BGM పర్వాలేదు. ‘జరగండి జరగండి..’ సాంగ్ ఆకట్టుకుంటుంది. రొటీన్ స్టోరీ, మాస్ ఎలివేషన్ సీన్స్ లేకపోవడం మైనస్. కామెడీ వర్కౌట్ కాలేదు. క్లైమాక్స్ ఫైట్ బోర్ తెప్పిస్తుంది. డైరెక్టర్ శంకర్ మార్క్ పాటలకే పరిమితమైంది.
RATING: 2.5/5
News January 10, 2025
20 కోచ్‌లతో విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను జనవరి 11 నుంచి 20 కోచ్‌లతో నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 18 చెయిర్ కార్, 2 ఎగ్జిక్యూటివ్ చెయిర్ కార్ కోచ్‌లు ఉండనున్నాయి. ప్రస్తుతం వందేభారత్‌లో 16 కోచ్‌లు ఉన్నాయి. ఈ ట్రైన్ ఉ.5.45 గంటలకు విశాఖ నుంచి, మ.3 గం.కు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది.
News January 10, 2025
ఉపాధి హామీ పథకం బిల్లులను తొందరగా చెల్లించాలి: సీఎం
TG: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బిల్లులను తొందరగా చెల్లించాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో దాదాపు 1.26 లక్షల ఉపాధి పనులు జరిగాయని అధికారులు వివరించగా, వాటికి సంబంధించిన మొత్తం బిల్లులను చెల్లించాలని సీఎం సూచించారు. కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలయ్యే నిధులు ఎప్పటికప్పుడు గ్రామాల అభివృద్ధికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు.