News March 2, 2026

B-2 బాంబర్: ఆకాశంలో అజేయ మృత్యుపాశం!

image

ప్రపంచ గగనతల చరిత్రలో ఒక అద్భుతం B-2 Spirit Stealth Bomber. రాడార్లకే దొరకని దీని ‘స్టెల్త్’ టెక్నాలజీ శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. సుమారు 20 టన్నుల అణు లేదా సంప్రదాయ ఆయుధాలను మోస్తూ 50,000 అడుగుల ఎత్తు నుంచి మృత్యువులా విరుచుకుపడుతుంది. ఒక్కసారి ఇంధనం నింపితే 9,600km ప్రయాణించి ప్రపంచంలో ఏ మూలనైనా నిశ్శబ్దంగా ధ్వంసం చేయగలదు. అమెరికా గగనతల ఆధిపత్యానికి ఇదే కీలకం.

Similar News

News March 2, 2026

J&K: ఖమేనీ మద్దతుదారులపైకి టియర్ గ్యాస్

image

అయతుల్లా ఖమేనీ హతానికి నిరసనగా జమ్మూకశ్మీర్లో షియా ముస్లిములు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఇరాన్ జెండాలతో వీధుల్లోకి వచ్చిన ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఇలా చేసినట్టు సమాచారం. ఉదయం నుంచి శ్రీనగర్లో షియాలు బంద్ పాటిస్తూ నిరసన చేపట్టడం తెలిసిందే. దీంతో అల్లర్లు జరగకుండా దేశవ్యాప్తంగా ఐబీ అలర్టైంది. రాష్ట్రాలకూ సూచనలు జారీ చేసింది.

News March 2, 2026

వార్ ఎఫెక్ట్: 22% పెరిగిన గ్యాస్ ధరలు!

image

వెస్ట్ ఏషియా యుద్ధంతో యూరప్‌లో గంటల వ్యవధిలోనే గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఏకంగా 22% ఎగిసినట్టు వార్తలు వస్తున్నాయి. సౌదీలోని అరామ్ కో ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి చేయడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నష్టం విలువ $2 ట్రిలియన్ల పైనే ఉంటుందని అంచనా. ఉక్రెయిన్ యుద్ధంతో రష్యా నుంచి గ్యాస్, చమురు దిగుమతులను ఆపేసిన యురోపియన్లకు ఇది పెద్ద దెబ్బే. వారి స్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారిందన్నది విశ్లేషకుల మాట.

News March 2, 2026

దలాల్ స్ట్రీట్‌లో ‘దడ’

image

ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం భారత మార్కెట్లను కుదిపేస్తోంది. సెన్సెక్స్ ఏకంగా 1700, నిఫ్టీ 560 పాయింట్లు నష్టపోయాయి. ఐటీ, పోర్ట్స్, ఎయిర్‌వేస్, ఆటో, చమురు రంగాల షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో రూ.10లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇక గోల్డ్, సిల్వర్ ETFs మాత్రం రయ్యిన దూసుకెళ్తున్నాయి. బిగ్ మనీ మొత్తం విలువైన మెటల్స్ వైపే పరుగులు తీస్తోంది. అనిశ్చితి మరింత పెరిగేలా కనిపిస్తోంది.