News August 2, 2024
B.Ed థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదల

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో నిర్వహించబోయే B.Ed థియరీ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి రాజకుమార్ గురువారం విడుదల చేశారు. 4వ సెమిస్టర్ ఈ నెల 12-17, 3వ సెమిస్టర్ 13-19, 2వ సెమిస్టర్ 13-22 తేదీల వరకు నిర్వహిస్తున్నామని చెప్పారు. పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు.
Similar News
News December 5, 2025
MBNR: స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు సభ్యుల నామినేషన్ల జోరు

మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా రెండో రోజున వార్డు సభ్యులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజున కేవలం 175 నామినేషన్లు దాఖలు కాగా రెండో రోజున భారీగా 864 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అత్యధికంగా జడ్చర్ల మండలం నుంచి 236 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు అయ్యాయి. బాలానగర్ నుంచి 231, భూత్పూర్ 155, మూసాపేట 126, అడ్డాకుల 116 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు.
News December 5, 2025
MBNR: స్థానిక ఎన్నికలు.. భారీగా నామినేషన్లు

స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా మూడో విడత నామినేషన్ల స్వీకరణ రెండో రోజున నామినేషన్లు భారీగా దాఖలు అయ్యాయి. అత్యధికంగా జడ్చర్ల మండలం నుంచి 81 నామినేషన్లు వచ్చాయి. బాలానగర్ మండలంలో 68 నామినేషన్లు, భూత్పూర్ మండలంలో 44 నామినేషన్లు, మూసాపేట మండలంలో 19 నామినేషన్లు, అడ్డాకులలో 37 నామినేషన్లు దాఖలయ్యాయి.
News December 5, 2025
MBNR: పొగ మంచు.. ఎస్పీ కీలక సూచనలు

✒అతివేగం, ఓవర్టేకింగ్ పూర్తిగా నివారించాలి
✒హైబీమ్ స్థానంలో లోబీమ్ లైట్లు,ఫాగ్ లైట్లు ఉపయోగించాలి
✒అద్దాలు,వైపర్లు,డిఫ్రాస్టర్లు శుభ్రంగా, సక్రమంగా పనిచేసేలా ఉంచాలి
✒ముందున్న వాహనానికి తగినంత సురక్షిత దూరం ఉంచాలి
✒పొగమంచు వలన ప్రయాణం ఆలస్యమయ్యే అవకాశం ఉందని ముందుగానే బయలుదేరాలి
✒ప్రతి డ్రైవర్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని ఎస్పీ డి.జానకి పేర్కొన్నారు.


