News August 2, 2024
B.Ed థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదల
పాలమూరు యూనివర్సిటీ పరిధిలో నిర్వహించబోయే B.Ed థియరీ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి రాజకుమార్ గురువారం విడుదల చేశారు. 4వ సెమిస్టర్ ఈ నెల 12-17, 3వ సెమిస్టర్ 13-19, 2వ సెమిస్టర్ 13-22 తేదీల వరకు నిర్వహిస్తున్నామని చెప్పారు. పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు.
Similar News
News October 13, 2024
కొండారెడ్డిపల్లిలో CM ప్రారంభోత్సవాలు ఇలా..
వంగూర్ మండలం కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ.55 లక్షలతో అమర జవాను యాదయ్య స్మారక గ్రంథాలయం, రూ.72 లక్షలతో నిర్మించిన కొత్త పంచాయతీ భవనం, రూ.45లక్షలతో BC సామాజిక భవనం, రూ.45 లక్షలతో చేపట్టిన పశు వైద్యశాల భవనాలను CM ప్రారంభించారు. సీఎం హోదాలో తొలిసారి వచ్చి రేవంత్‌కు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
News October 13, 2024
సొంతూరిలో రేవంత్ రెడ్డికి బ్రహ్మరథం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో విజయదశమి సందర్భంగా శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ప్రజలు సీఎం రేవంత్ రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఒకేసారి రోడ్డుపైకి వచ్చి బోనాలతో పాటు తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో ఆయనకు స్వాగతం పలికారు. దీంతో సీఎం ఆనందంతో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
News October 12, 2024
ఉమ్మడి పాలమూరు జిల్లా నేటి ముఖ్యాంశాలు
✓ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా విజయదశమి వేడుకలు.
✓ అలంపూర్: కన్నుల పండుగగా తెప్పోత్సవం.
✓ అలంపూర్: జోగులాంబను దర్శించుకున్న డీజీపీ జితేందర్.
✓ కొండారెడ్డిపల్లిలో అభివృద్ధి పనులను ప్రారంభించి దసరా వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.
✓ కల్వకుర్తి: ఉప్పొంగిన దుందుభి వాగు రాకపోకలు బంద్.
✓ రేపు కోడంగల్ రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
✓ ఉమ్మడి జిల్లాలో ఘనంగా బతుకమ్మ, దేవి నవరాత్రి ఉత్సవాలు.