News February 23, 2025
మళ్లీ ఏడాది కోర్సుగా B.Ed, M.Ed?

AP: బీఈడీ, ఎంఈడీ కోర్సులను తిరిగి ఏడాది కోర్సులుగా ప్రవేశపెట్టాలని NCTE యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై NCTE వెబ్సైట్లో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోనుంది. ఆ తర్వాత ఏడాది ఫార్మాట్లోకి మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా పదేళ్ల క్రితం B.Ed, M.Ed కోర్సులు ఏడాది పాటే ఉండగా, రెండేళ్లకు పొడిగించిన విషయం తెలిసిందే.
Similar News
News December 6, 2025
సిద్దిపేట: అథ్లెటిక్స్లో సత్తాచాటిన శ్రీదేవి

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సిద్దిపేట డిగ్రీ కళాశాల విద్యార్థిని అసాధారణ ప్రతిభ కనబరిచి తృతీయ స్థానం సాధించింది. డిగ్రీ ఫస్టియర్ విద్యార్థిని ఏ. శ్రీదేవి ఉస్మానియా యూనివర్సిటీ స్థాయిలో జరిగిన ఇంటర్ కాలేజ్ అథ్లెటిక్స్ పోటీల్లో 400 మీటర్స్ హర్డిల్స్లో సత్తాచాటింది. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినిని కళాశాల ప్రిన్సిపల్ జి. సునీత ప్రత్యేకంగా అభినందించారు.
News December 6, 2025
హిట్ మ్యాన్@ 20,000 రన్స్

SAతో మూడో వన్డేలో రోహిత్ శర్మ కీలక మైలురాయిని చేరుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్(టెస్టు, వన్డే, T20)లో 20,000 పరుగులు చేసిన నాలుగో ఇండియన్ ప్లేయర్గా నిలిచారు. కేశవ్ వేసిన 14 ఓవర్ నాలుగో బంతికి సింగిల్ తీసి ఈ ఘనత సాధించారు. సచిన్(34,357), కోహ్లీ(27,910), ద్రవిడ్(24,064) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. కాగా ప్రస్తుత మ్యాచ్లో భారత్ నిలకడగా ఆడుతోంది. క్రీజులో జైస్వాల్(38), రోహిత్(50) ఉన్నారు.
News December 6, 2025
నెలసరి లీవ్స్.. మన రాష్ట్రంలో అమలు చేస్తారా?

TG: కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య నెలసరి ప్రయోజన బిల్లు-2024(ప్రైవేట్)ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. మహిళలకు నెలసరి సమయంలో 4 రోజుల పెయిడ్ లీవ్స్తో పాటు బ్రేక్స్, పనిచేసే ప్రాంతాల్లో సౌకర్యాల కల్పన, హక్కులు ఉల్లంఘిస్తే కంపెనీలకు భారీగా జరిమానాలు విధించాలని బిల్లు కోరుతోంది. ఇప్పటికే కర్ణాటక, బిహార్, ఒడిశా ప్రభుత్వాలు ఈ తరహా సెలవులు ఇస్తుండగా తెలంగాణలోనూ ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది.


