News November 6, 2025
B.R నాయుడిపై మండిపడ్డ భూమన

TTD ఛైర్మన్‌గా BR నాయుడు ఏడాది పాలన ఒక అసమర్థుడి జీవన యాత్రలాగా ఉందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తిరుమలలో బ్లాక్ టికెట్ల దందా, సెటిల్‌మెంట్లు ఛైర్మన్ కార్యాలయం కేంద్రంగా నడుస్తున్నాయని ఆరోపించారు. AI టెక్నాలజీని ముందుగా ఛైర్మన్ మైండ్ సెట్‌ను మార్చడానికి ఉపయోగించాలని ఆయన ఎద్దేవా చేశారు. ఆయన పాలనలో భక్తులకు ఒరిగిందేమి లేదని మండిపడ్డారు.
Similar News
News November 6, 2025
KMR: మిడ్ డే మీల్స్ పెండింగ్ బిల్లులను చెల్లించాలని వినతి

పెండింగ్‌లోని బిల్లులను వెంటనే విడుదల చేయాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు డిమాండ్ చేశారు. గురువారం కామారెడ్డి కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. MDM నిర్వహణ కమిటీ అధ్యక్షురాలు హేమలత మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన పథకానికి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సుమారు రూ.8 కోట్లు పెండింగ్ బకాయిలు విడుదల కావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలన్నారు.
News November 6, 2025
SRD: ‘సైబర్ మోసాలకు గురైతే ఇలా చేయండి’

విద్యార్థులు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెల్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి సూచించారు. సంగారెడ్డి మండలం పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. సెల్ ఫోన్లలో వచ్చే ఏపీకే ఫైల్స్‌ను ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే https://www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు తెలిపారు.
News November 6, 2025
బీఆర్ఎస్ ఫేక్ సర్వేలను తిప్పికొట్టండి: రేవంత్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలవబోతున్నామని మంత్రులతో మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బైపోల్‌పై ఆయన వారితో సమీక్ష నిర్వహించారు. మిగిలిన 3 రోజుల్లో ప్రచారంలో దూకుడు పెంచాలని సూచించారు. సోషల్ మీడియాలో రోజుకో ఫేక్ సర్వే వదులుతూ ప్రజలు, ఓటర్లను బీఆర్ఎస్ గందరగోళానికి గురి చేస్తోందని, దీన్ని సమర్థంగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాలన్నారు.


