News September 24, 2025

17 మంది విద్యార్థినులపై బాబా లైంగిక దాడి!

image

ఢిల్లీ వసంత్ కుంజ్ ప్రాంతంలోని ఓ ఆశ్రమ డైరెక్టర్ స్వామి చైతన్యానంద సరస్వతిపై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. శారదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్‌లో EWS స్కాలర్‌షిప్‌తో చదువుతున్న 17మంది PG స్టూడెంట్స్ చైతన్యానందపై ఆరోపణలు చేశారు. తమను దుర్భాషలాడేవాడని, అభ్యంతరకర మెసేజులు పంపేవాడని, శారీరకంగా కలవాలని బలవంతం చేసేవాడని వాపోయారు. ప్రస్తుతం ఆ బాబా పరారీలో ఉన్నాడు.

Similar News

News September 24, 2025

వైద్య కళాశాలలు ధారాదత్తం చేయట్లేదు: సత్యకుమార్

image

AP: ప్రైవేటీకరణకు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌కు తేడా తెలియని వ్యక్తి గతంలో CMగా చేయడం దౌర్భాగ్యమని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. మండలిలో మెడికల్ కాలేజీల PPP విధానంపై ఆయన వివరణ ఇచ్చారు. ‘భూమి యాజమాన్యం హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడి పెడతారు. కళాశాలలపై పూర్తి పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. కాలేజీలను ఎవరికీ ధారాదత్తం చేయట్లేదు’ అని తెలిపారు.

News September 24, 2025

12 రోజుల్లో ₹140 కోట్లకు పైగా కలెక్షన్స్

image

తేజా సజ్జ హీరోగా నటించిన ‘మిరాయ్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12 రోజుల్లో రూ.140 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. నార్త్ అమెరికా కలెక్షన్స్ $3M (రూ.26కోట్లు)కి చేరువలో ఉన్నట్లు తెలిపింది. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ మూవీ ఈ నెల 12న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో మంచు మనోజ్ విలన్‌గా, రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు.

News September 24, 2025

బతుకమ్మ గిన్నిస్ రికార్డ్ కార్యక్రమం వాయిదా

image

TG: ఈ నెల 28న గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన బతుకమ్మ వేడుకలను పర్యాటక శాఖ వాయిదా వేసింది. వర్షాలు కురుస్తాయన్న IMD హెచ్చరికతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ కార్యక్రమాన్ని ఈనెల 29న సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ వేడుకల్లో 50 అడుగులకు పైగా ఎత్తుతో బతుకమ్మను ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 10 వేల మంది మహిళలు పాల్గొననున్నారు.