News March 27, 2024

మళ్లీ కెప్టెన్‌గా బాబర్!

image

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్‌లో జరగనున్న T20WCకు అతడి నాయకత్వంలోనే పాక్ బరిలోకి దిగనున్నట్లు వార్తలొస్తున్నాయి. వన్డే వరల్డ్ కప్-2023లో పాక్ పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ గతేడాది NOV 15న బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో బాబర్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని PCB నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Similar News

News October 4, 2024

చిన్న ఆలయాలకు సాయం రూ.10వేలకు పెంపు

image

AP: ఆదాయం లేని చిన్న ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు ప్రతి నెలా అందించే సాయాన్ని రూ.5,000 నుంచి రూ.10,000లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో రూ.7వేలు అర్చకుడి భృతిగా, రూ.3వేలు పూజలకు వినియోగించాలని పేర్కొంది. ఈ మొత్తాన్ని అర్చకుడి ఖాతాలోనే జమ చేస్తామంది. దీనివల్ల రాష్ట్రంలోని 5,400 ఆలయాలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వంపై అదనంగా ఏటా రూ.32.40 కోట్ల భారం పడనుంది.

News October 4, 2024

ఆస్పత్రి నుంచి రజినీకాంత్ డిశ్చార్జ్

image

చెన్నైలోని అపోలో ఆస్పత్రి నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ నిన్న రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. 4 రోజుల క్రితం కడుపు నొప్పితో ఆయన ఆసుపత్రిలో చేరగా, రక్తనాళంలో వాపు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు స్టెంట్‌ను అమర్చారు. ఇప్పుడు ఆయన కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. రజినీ నటించిన ‘వేట్టయాన్’ ఈనెల 10న థియేటర్లలో రిలీజ్ కానుంది.

News October 4, 2024

డీఎస్పీగా నిఖత్ జరీన్

image

TG: బాక్సర్ నిఖత్ జరీన్ డీఎస్పీ యూనిఫామ్‌లో కనిపించారు. నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగిన చీఫ్ మినిస్టర్ కప్-2024 ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ఆమెను సత్కరించి లాఠీని అందజేశారు. క్రీడల్లో రాణించిన వారిని ప్రభుత్వం ఎలా ప్రోత్సహిస్తుందో చెప్పడానికి నిఖత్ ఒక నిదర్శనం అని CM అన్నారు. బాక్సింగ్‌లో రాణించి మెడల్స్ సాధించినందుకు గాను ఆమెకు ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది.