News June 17, 2024

రికార్డు సృష్టించిన బాబర్ ఆజమ్

image

T20 వరల్డ్‌కప్ మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా బాబర్ ఆజమ్ నిలిచారు. 17 ఇన్నింగ్స్‌ల్లోనే ఆయన 549 పరుగులు చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో ధోనీ(529-భారత్), విలియమ్సన్(527-న్యూజిలాండ్), జయవర్దనె(360-శ్రీలంక), గ్రేమ్ స్మిత్(352-దక్షిణాఫ్రికా) ఉన్నారు.

Similar News

News January 29, 2026

GWL: ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలి

image

మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. గురువారం ఐడిఓసిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల నియమావళి పాటించాలన్నారు. నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశామని, రేపు సాయంత్రం 5:00 లోపు నామినేషన్లు సమర్పించాలన్నారు. ఎన్నికల నియమావళి అమలు చేసేందుకు అందరు సహకరించాలన్నారు.

News January 29, 2026

పాకిస్థాన్‌కు అంత దమ్ము లేదు: రహానే

image

T20 ప్రపంచ కప్‌ను బాయ్‌కాట్ చేస్తామంటూ బెదిరిస్తున్న పాకిస్థాన్‌పై భారత క్రికెటర్ అజింక్య రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ అలా చేస్తుందని తాను అనుకోవడం లేదని చెప్పారు. ఆ జట్టుకు అంత దమ్ము లేదన్నారు. టోర్నీ ఆడేందుకు పాక్ వస్తుందని అభిప్రాయపడ్డారు. వరల్డ్ కప్ కోసం శ్రీలంకలోని కొలంబోకు వెళ్లేందుకు పాకిస్థాన్ టీమ్ టికెట్లు బుక్ <<18990370>>చేసుకున్నట్లు<<>> వార్తలు రావడం తెలిసిందే.

News January 29, 2026

ఎన్నికలు జరిగితే NDAకు 352 సీట్లు: ఇండియా టుడే సర్వే

image

దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే NDAనే గెలుస్తుందని Mood of the Nation సర్వేలో ఇండియా టుడే వెల్లడించింది. NDAకు 352 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని ‘ఇండీ’ కూటమి 182 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. బీజేపీకి 41 శాతం(287 సీట్లు), కాంగ్రెస్‌కు 20 శాతం(80 సీట్లు), మిగతా పార్టీలకు 39 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.