News May 11, 2024

రూ.20 కోట్లు ఇచ్చినా బాబర్ IPL ఆడడు: రమీజ్

image

IPLలో రూ.20 కోట్లు ఇచ్చినా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆడరని ఆ దేశ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా అన్నారు. అతడు దేశానికే ప్రాధాన్యం ఇస్తారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రమీజ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. కోహ్లీకే రూ.15 కోట్లు ఇస్తుంటే.. బాబర్‌కు రూ.20 కోట్లు ఇస్తారా? అని ఎద్దేవా చేస్తున్నారు. బాబర్ చిన్న దేశాలపైనే ఆడతారని కామెంట్లు చేస్తున్నారు.

Similar News

News January 9, 2026

TGలో ‘రాజాసాబ్’ బుకింగ్స్ ప్రారంభం

image

తెలంగాణలో ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమా టికెట్ బుకింగ్స్ ప్రారంభమైనట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈరోజు రాత్రి 11.30 గంటల ప్రీమియర్ షోకు సంబంధించిన టికెట్లు డిస్ట్రిక్ట్ యాప్‌లో అందుబాటులోకి వచ్చాయి. అటు ఏపీలో 9pmకే ప్రీమియర్స్ ప్రారంభం కాగా, థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.

News January 8, 2026

అమెరికా నియమాలను ఉల్లంఘిస్తోంది: ఫ్రాన్స్ అధ్యక్షుడు

image

అమెరికా విదేశాంగ విధానాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, జర్మనీ ప్రెసిడెంట్ ఫ్రాంక్ వాల్టర్ ఖండించారు. ‘US క్రమంగా దాని మిత్రదేశాల్లో కొన్నింటి నుంచి దూరం జరుగుతోంది. ఇంతకాలం అది ప్రోత్సహిస్తూ వచ్చిన అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘిస్తోంది. కొత్త వలసవాదం, సామ్రాజ్యవాదాన్ని ఫ్రాన్స్ తిరస్కరిస్తుంది’ అని మేక్రాన్ చెప్పారు. ప్రపంచం దోపిడీదారుల డెన్‌లా మారే ప్రమాదం ఉందని ఫ్రాంక్ వాల్టర్ అన్నారు.

News January 8, 2026

అద్దె బస్సుల యజమానుల సమ్మె నోటీసులు!

image

AP: RTC అద్దె బస్సుల యజమానులు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి సమ్మె నోటీసులిచ్చారు. బస్సు అద్దె పెంచాలని అందులో డిమాండ్ చేశారు. లేకపోతే ఈ నెల 12 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. స్త్రీశక్తితో అధిక రద్దీ వల్ల భారం పడుతోందని, అదనంగా నెలకు రూ.15-20వేల వరకు ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్రంలో 2,500 వరకు అద్దె బస్సులుండగా, సమ్మెకు దిగితే సంక్రాంతి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి.