News January 11, 2025

తిరుపతి ఘటనలో బాబే తొలి ముద్దాయి: రోజా

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో తొలి ముద్దాయిగా CM చంద్రబాబు పేరును చేర్చాలని YCP నేత రోజా డిమాండ్ చేశారు. ఘటన జరిగి 3 రోజులవుతున్నా ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె నిలదీశారు. ‘సంధ్య థియేటర్ ఘటనలో ఒక్కరు చనిపోతేనే 16 మందిపై క్రిమినల్ కేసులు పెట్టారు. తిరుపతిలో ఆరుగురు చనిపోయినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనకు కారకులైన CM, Dy.CM, TTD EO, JEO, SPలపై కేసు నమోదు చేయాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.

Similar News

News November 13, 2025

కేంద్రీయ విద్యాలయం, నవోదయలో 12,799 పోస్టులు

image

కేంద్రీయ విద్యాలయం, నవోదయలో 12,799 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో కేంద్రీయ విద్యాలయంలో 9,156( 7,444 టీచింగ్, 1,712 నాన్ టీచింగ్ పోస్టులు), నవోదయలో 3,643 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ, B.Ed, D.Ed, పీజీ, సీటెట్, ఇంటర్, డిప్లొమా, B.LSc అర్హతగల అభ్యర్థులు రేపటి నుంచి డిసెంబర్ 4వరకు అప్లై చేసుకోవచ్చు.

News November 13, 2025

భారత్, అఫ్గానిస్థాన్‌తో యుద్ధానికి సిద్ధం: పాకిస్థాన్

image

భారత్, అఫ్గానిస్థాన్‌తో ప్రత్యక్ష యుద్ధానికి రెడీగా ఉన్నామని పాకిస్థాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ఇస్లామాబాద్‌లో మంగళవారం జరిగిన సూసైడ్ బాంబ్ బ్లాస్ట్‌లో 12 మంది మరణించగా 36 మంది గాయపడ్డారు. దాడి చేసింది తామేనని పాకిస్థానీ తాలిబన్ (TTP) ప్రకటించుకున్న తర్వాత ఆసిఫ్ చేసిన కామెంట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత మద్దతుతోనే దాడి జరిగిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపిస్తున్నారు.

News November 13, 2025

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

image

AP: అనంతపురం జిల్లాలోని మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖ వన్ స్టాప్ సెంటర్‌లో 4 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల 25 వరకు అప్లై చేసుకోవచ్చు. సైకో-సోషల్ కౌన్సెలర్, మల్టీ పర్పస్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల వయసు 25 -42ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీ, డిప్లొమా (సైకాలజీ), టెన్త్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.