News November 27, 2024
బాబోయ్..! వరుడికి ఇవేం కండీషన్లు పెళ్లి కూతురా!!

ఓ ఇంగ్లిష్ డైలీలో పబ్లిష్ అయిన ఓ మ్యాట్రిమోని యాడ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘స్త్రీవాద అభిప్రాయాలతో పొట్టి జుట్టు, చెవి పోగులు గల 30+ వయసు గల విద్యావంతురాలు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. ఆమెకు 25-28 మధ్య వయస్సులోని అందమైన యువకుడు కావలెను. ఏకైక సంతానమై సొంత వ్యాపారాలు, భారీ బంగ్లా లేదా 20 ఎకరాల భూమి ఉండాలి. వంట తప్పక తెలియాలి’ అని ప్రకటనలో పేర్కొంది. ఈ డిమాండ్లపై మీరేమంటారు?
Similar News
News January 23, 2026
జైలు నుంచి జోగి రమేశ్, రాము విడుదల

AP: నకిలీ మద్యం కేసులో అరెస్టయిన YCP నేత జోగి రమేశ్, ఆయన సోదరుడు రాము జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో 85రోజులుగా విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారికి తంబళ్లపల్లి కోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేసింది. ‘జైలులో మమ్మల్ని ఇబ్బందిపెట్టారు. అక్రమ కేసులకు మేం భయపడం. రెడ్ బుక్ మడిచి జేబులో పెట్టుకోండి. జగన్‌ను మళ్లీ CM చేసేదాకా కొదమసింహాల్లా పనిచేస్తాం’ అని విడుదల అనంతరం జోగి రమేశ్ వ్యాఖ్యానించారు.
News January 23, 2026
లిక్కర్ స్కామ్.. ముగిసిన మిథున్‌రెడ్డి విచారణ

AP: లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. 7 గంటలపాటు హైదరాబాద్ ఈడీ ఆఫీసులో అధికారులు ఆయనను విచారించారు. మిథున్‌రెడ్డి వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేశారు. అనంతరం ఆయన ఇంటికి వెళ్లిపోయారు. నిన్న విజయసాయిరెడ్డిని ఇదే కేసులో అధికారులు 7 గంటలపాటు విచారించిన సంగతి తెలిసిందే.
News January 23, 2026
వృద్ధాప్యానికి చెక్ పెట్టొచ్చు: ఎలాన్ మస్క్

మరణాన్ని, వృద్ధాప్యాన్ని అడ్డుకోవచ్చని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. వయసుని తగ్గించడం కూడా సాధ్యమేనని అన్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఆయన మాట్లాడారు. శరీరంలోని అన్ని భాగాలు ఒకేసారి ముసలితనం వైపు వెళ్తున్నాయంటే దానికి ఒక కారణం తప్పకుండా ఉంటుందన్నారు. అయితే మనిషి ఎక్కువ కాలం జీవిస్తే క్రియేటివిటీ తగ్గి సమాజంలో వచ్చే మార్పులు ఆగిపోవచ్చని మస్క్ అభిప్రాయపడ్డారు.


