News June 4, 2024

రేపు ఢిల్లీకి బాబు, పవన్!

image

AP: టీడీపీ చీఫ్ చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయనతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా హస్తిన వెళ్లే అవకాశం ఉంది. వీరు బీజేపీ నిర్వహించే ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరవుతారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీల మద్దతును బీజేపీ కూడగట్టనుంది. అటు సీఎంగా తన ప్రమాణ స్వీకారానికి మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలను చంద్రబాబు ఆహ్వానించనున్నారు.

Similar News

News December 5, 2025

విమానాల రద్దు.. ఈ విషయాలు తెలుసుకోండి!

image

3 రోజులుగా ఇండిగో విమాన <<18473431>>సర్వీసులు<<>> రద్దవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయాల్లో ఎయిర్‌లైన్స్ పాటించాల్సిన బాధ్యతలపై DGCA రూల్స్ జారీ చేసింది. ఆ ప్రకారం.. సర్వీసు రద్దయితే ముందే సమాచారం ఇవ్వాలి. ప్రత్యామ్నాయ విమానంలో ఫ్రీగా వెళ్లే ఏర్పాటు చేయాలి. ప్రయాణికులు కోరుకుంటే రీఫండ్ చేయాలి. 2గంటలకు మించి ఆలస్యమైతే భోజనం, ఫ్రెష్ అయ్యే సౌకర్యం కల్పించాలి. 24 గంటలు దాటితే ఫ్రీగా హోటల్, రవాణా ఏర్పాటు చేయాలి.

News December 5, 2025

పుతిన్‌కు ‘బాడీ డబుల్స్’ ఉన్నారా?

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో ఆయన ‘బాడీ డబుల్స్’ గురించి చర్చ జరుగుతోంది. బహిరంగ కార్యక్రమాలు, ప్రయాణాలకు బాడీ డబుల్స్‌ను ఉపయోగిస్తారని ఊహాగానాలు ఉన్నాయి. పుతిన్‌కు ముగ్గురు డూప్స్ ఉన్నారని ఉక్రెయిన్ గతంలో చెప్పింది. వారు ‘క్లోన్ ఆర్మీ’ అని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే అవన్నీ అవాస్తవాలని, ‘బాడీ డబుల్’ ప్రతిపాదనలను తాను తిరస్కరించానని గతంలో పుతిన్ పలుమార్లు క్లారిటీ ఇచ్చారు.

News December 5, 2025

జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

<>జూలాజికల్ <<>>సర్వే ఆఫ్ ఇండియా 9 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు DEC 18 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MSc(జువాలజీ/వైల్డ్ లైఫ్ సైన్స్/ఎకాలజీ/లైఫ్ సైన్సెస్/ఆంథ్రోపాలజీ), PhD, MA(ఆంథ్రోపాలజీ/సోషల్ సైన్సెస్/హిస్టరీ/ఎకనామిక్స్/ఫిలాసఫీ ఉత్తీర్ణులు అర్హులు. Sr ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.57వేలు+HRA, ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.35వేలు+HRA చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://zsi.gov.in