News June 5, 2024
బాబు గెలుపు – కాసుల పంట పండిస్తున్న హెరిటేజ్ షేర్లు
హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు దూసుకెళ్తున్నాయి. మూడు రోజుల్లోనే 30 శాతం మేర లాభపడ్డాయి. అంటే రూ.140 మేర ఎగిశాయి. గురువారమైతే ఏకంగా 20 శాతంతో అప్పర్ సర్క్యూట్ను తాకాయి. ఇంట్రాడేలో 472 వద్ద కనిష్ఠ, 546 వద్ద గరిష్ఠ స్థాయుల్ని చేరాయి. చివరికి రూ.91 లాభంతో రూ.546 వద్దే ముగిశాయి. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడం, కేంద్రంలో కీలకంగా మారడమే ఇందుకు కారణాలు. కంపెనీలో భువనేశ్వరికి 24.37% వాటా ఉంది.
Similar News
News November 28, 2024
ఫూలే స్ఫూర్తితో ప్రభుత్వం ముందుకెళ్తుంది: సీఎం చంద్రబాబు
AP: మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన చూపిన బాట అనుసరణీయమని కొనియాడారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని ట్వీట్ చేశారు.
News November 28, 2024
ఒక టూరిస్టులాగా ఫొటో తీసుకున్నా: ఆర్జీవీ
AP: గతేడాది చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు జైలు ఎదుట ఆర్జీవీ సెల్ఫీ తీసుకోవడం హాట్ టాపిక్ అయింది. తాజాగా ఆయన దానిపై స్పందించారు. ‘చంద్రబాబు జైల్లో ఉన్నాడని అందరికీ తెలుసు. ఒక టూరిస్టులాగా ఫొటో తీసుకున్నా. ఆ స్థానంలో గాంధీ, హిట్లర్, జగన్ ఉన్నా నేను అలానే చేసేవాణ్ని. దాంట్లో రెచ్చగొట్టడం, హేళన చేయడం ఏముంది?’ అని ఓ ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.
News November 28, 2024
తమిళనాడులో ఫాక్స్కాన్ భారీ పెట్టుబడి!
తమిళనాడు మరో భారీ ప్రాజెక్టును దాదాపుగా సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫాక్స్కాన్ కంపెనీ ప్రపంచంలో రెండో అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సెంటర్ (BESS)ను తమిళనాడులో నెలకొల్పనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం తమిళనాడు ప్రభుత్వం చెన్నైకి 50 కి.మీ దూరంలో 200 ఎకరాలను ఆఫర్ చేసినట్లు సమాచారం. దాంతో పాటు ఇన్సెంటివ్ ప్యాకేజీ కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది.