News April 7, 2024
కుప్పంలో బాబు.. పిఠాపురంలో పవన్ ఓటమి ఖాయం: అంబటి

AP: కుప్పంలో చంద్రబాబు.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమి పాలవుతారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ‘చంద్రబాబు నాపై తప్పుడు ప్రచారం చేశారు. డబ్బుల కోసం నేనెప్పుడూ కక్కుర్తి పడలేదు. బాబు తప్పిదంతోనే పోలవరం ఆలస్యమవుతోంది. ఓటమి ఖాయమవడంతో చంద్రబాబు ఫ్రస్టేషన్లో ఉన్నారు. పవన్ రెండు రోజులు ప్రచారం చేసి 5 రోజులు పడుకుంటారు. పొత్తు పెట్టుకోవడం అంటే సమాధి కట్టుకోవడమే’ అని ఆయన మండిపడ్డారు.
Similar News
News November 17, 2025
మోక్ష మార్గాన్ని చూపే విష్ణు శ్లోకం

ఏష మే సర్వధర్మాణాం ధర్మో ధిక తమోమతః|
యద్భక్త్యా పుణ్డరీకాక్షం స్తవైరర్చేన్నరస్సదా||
‘పద్మముల వంటి కన్నులు గల విష్ణువును ఎవరైతే భక్తితో, స్తోత్రములతో ఆరాధిస్తారో.. అదే అన్ని ధర్మముల కంటే గొప్పదైనది’ అని ఈ శ్లోకం చెబుతోంది. ఇతర కర్మలు, వ్రతాలు, ఆచారాల కంటే దేవుడి పట్ల నిష్కల్మషమైన ఆరాధన, కీర్తన అత్యంత ముఖ్యమైనది, ఉత్తమమైనది. శుద్ధమైన భక్తి భావమే మనకు మోక్ష మార్గాన్ని చూపుతుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News November 17, 2025
గర్భ నిరోధక ఇంజెక్షన్ గురించి తెలుసా?

పిల్లలు పుట్టకుండా ఉండేందుకు అనేక పద్ధతులు పాటిస్తారు. అయితే కొన్నిసార్లు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. వీటికి ప్రత్యామ్నాయమే ఈ ఇంజెక్షన్. దీన్ని డిపోమెట్రోక్సీ ప్రొజెస్టెరాన్ అసిటేట్ (DMPA) ఇంజెక్షన్ అంటారు. 3నెలల పాటు గర్భం రాకుండా మహిళలు ఈ ఇంజెక్షన్ వాడొచ్చు. తర్వాత నెల విరామంతో మరో ఇంజెక్షన్ తీసుకోవాలి. దీనివల్ల రోజూ గర్భనిరోధక మాత్ర వేసుకోవాల్సిన అవసరం ఉండదు.
News November 17, 2025
తమ్ముడి కులాంతర వివాహం.. అన్న దారుణ హత్య!

TG: తమ్ముడి కులాంతర వివాహం అన్న చావుకొచ్చిన ఘటన MBNR(D)లో జరిగింది. రంగారెడ్డి(D) ఎల్లంపల్లికి చెందిన రాజశేఖర్ తమ్ముడు చంద్రశేఖర్ అదే గ్రామానికి చెందిన భవానీ ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో యువతి తండ్రి వెంకటేశ్ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారు. రాజశేఖర్ సహకారంతోనే ఇదంతా జరిగిందని వెంకటేశ్ మరో ఐదుగురితో కలిసి రాజశేఖర్ను కిడ్నాప్ చేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపాడు.


