News October 13, 2024
దాతలు రూ.కోట్లు ఇస్తుంటే బాబు ‘పులిహోర’ చేస్తున్నారు: అంబటి

AP: వరద సాయం నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. ‘వరద బాధితుల కోసం దాతలు రూ.కోట్లు ఇస్తున్నారు. బాబుగారేమో ‘‘పులిహోర’’ చేస్తున్నారు’ అని సెటైర్లు వేశారు. మరోవైపు దాతలు రూ.కోట్లు ఇస్తుంటే రూ.కోటి విరాళం ప్రకటించిన మాజీ సీఎం జగన్ మాత్రం ఇంకా ఇవ్వలేదని టీడీపీ శ్రేణులు అంబటికి కౌంటర్ ఇస్తున్నారు.
Similar News
News January 28, 2026
30 రోజుల లోపు మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు కట్టడికి సూచనలు

మొక్కజొన్న విత్తిన వెంటనే ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చి కత్తెర పురుగు ఉనికిని గమనించాలి. మొక్కలపై వాటి గుడ్లను గమనిస్తే వేపమందును పిచికారీ చేయాలి. లేత మొక్కజొన్న పంటల్లో 30 రోజుల వరకు ఎకరాకు 15 పక్షి స్థావరాలను, 15 లింగాకర్షక బుట్టలను పైరులో ఏర్పాటు చేసుకోవాలి. ఎకరాకు 9 కిలోల పొడి ఇసుక, కిలో సున్నాన్ని కలిపి మొక్కజొన్న సుడులలో వేస్తే ఇసుక రాపిడికి కత్తెర పురుగు లార్వాలు చనిపోతాయి.
News January 28, 2026
భారీగా పెరిగిన కొబ్బరి ధరలు

AP: కొన్ని నెలలుగా ధరలు లేక ఇబ్బందులు పడుతున్న కొబ్బరి రైతులకు ఊరట కలుగుతోంది. TGలో మేడారం జాతర, వరుస శుభకార్యాల ప్రభావంతో ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. వారం కిందటి వరకు వెయ్యి కాయల ధర రూ.15-16వేలు ఉండగా ఇప్పుడు రూ.19-20 వేలకు చేరింది. ఉభయగోదావరి జిల్లాల నుంచి రోజూ 70 లారీల సరకు ఎగుమతి అవుతోంది. ఇక కురిడీ కొబ్బరిలో పెద్ద రకం రూ.32,500, చిన్నకాయ రూ.29వేల వరకు పలుకుతోంది.
News January 28, 2026
త్వరలో విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీ: మంత్రి గొట్టిపాటి

AP: విద్యుత్ శాఖలో ఏఈ స్థాయి ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. రైతులు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను దుర్వినియోగం చేసి ప్రజలపై రూ.30 వేల కోట్ల భారం మోపిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఛార్జీలు పెంచకుండా, ఎన్నికల లోపు తగ్గించే దిశగా అడుగులు వేస్తోందన్నారు.


