News August 25, 2024

టీడీపీలోకి బాబుమోహన్?

image

TG: హాస్యనటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ త్వరలో టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబును ఆయన తాజాగా కలవడం ఈ వార్తకు బలాన్ని చేకూరుస్తోంది. గతంలో ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్, బీజేపీ, ప్రజాశాంతి పార్టీలకు మారుతూ వచ్చారు.

Similar News

News March 21, 2026

KNR: అమలుకు నోచుకోని రాజీవ్ యువ వికాసం..!

image

కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు నోచుకోక నిరుద్యోగుల్లో నిరాశ పెరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 1,44,640 మంది యువత దరఖాస్తు చేసుకోగా, KNRలో 42,565, పెద్దపల్లిలో 47,470, జగిత్యాలలో 31,128, రాజన్న సిరిసిల్లలో నమోదు చేసుకున్నారు. స్వయం ఉపాధికి రూ.3 లక్షల వరకు సాయం ప్రకటించినప్పటికీ, సంవత్సరం గడిచినా పురోగతి కనిపించక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

News March 21, 2026

రోహిత్‌ను MI పూర్తిగా వాడుకోవాలి: ఇర్ఫాన్

image

స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించారు. ‘రోహిత్‌ను MI ఎలా యూజ్ చేసుకుంటుందనేది కీలకం. ఇంపాక్ట్ ప్లేయర్‌లా కాకుండా అతడు గ్రౌండ్‌లో ఉండటం చాలా ముఖ్యం. కెప్టెన్‌కు సాయపడగలడు. విజయవంతమైన సారథిని వీలైనంత ఎక్కువ ఉపయోగించుకోవాలి’ అని సూచించారు. గత IPLలో రోహిత్ భారీగా పరుగులు చేశారని, ఈసారి ఇంకా మెరుగ్గా ఆడతారని అన్నారు.

News March 21, 2026

TDP మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

image

AP: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం TDP మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి(81) కన్నుమూశారు. అనంతపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈయన ఉమ్మడి అనంతపురం జిల్లా TDP అధ్యక్షుడిగా 10 ఏళ్లు పనిచేశారు. పంచాయతీ వార్డు సభ్యుడి స్థాయి నుంచి 2014లో ఎమ్మెల్యేగా ఎదిగారు. అటు ఉమ్మడి ఏపీ మార్క్‌ఫెడ్ ఛైర్మన్‌గా పని చేశారు. ఈయన మృతిపట్ల ఆ పార్టీ నేతలు సంతాపం తెలిపారు.