News February 21, 2025

ఏపీ కోసం బాబు, పవన్ కష్టపడుతున్నారు: కేంద్ర మంత్రి

image

AP: ఏపీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాగా కష్టపడుతున్నారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అన్నారు. విజయవాడలో పర్యటించిన ఆయన.. ఈ రాష్ట్రానికి డైనమిక్ సీఎం చంద్రబాబు ఉన్నారని ప్రశంసించారు. ‘రాజధాని అమరావతి, సాగునీటి ప్రాజెక్టులతోపాటు పోర్టుల నిర్మాణానికి నిధులు కేటాయించాం. ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్నివిధాలా సహకరిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 3, 2025

మీక్కూడా ఫేవరెట్ కిడ్ ఉన్నారా?

image

చాలా కుటుంబాల్లో తెలియకుండానే ‘ఫేవరెట్‌ కిడ్‌’ ప్రభావం కనిపిస్తుందంటున్నారు నిపుణులు. తల్లిదండ్రుల ప్రేమలో తేడా లేకపోయినా.. చిన్నచిన్న సందర్భాల్లో ఈ పక్షపాతం బయట పడుతుంది. కొన్నిసార్లు ఒకరితో ఎక్కువ ఓపికగా, ఆప్యాయంగా ఉండటం చేస్తుంటారు. కొన్నిసార్లు ఇది తల్లిదండ్రులు కూడా గ్రహించకపోవచ్చు. తల్లిదండ్రులు తమను తక్కువగా చూస్తున్నారనే భావన పిల్లల్లో నెగెటివ్‌ ఆలోచనలను పెంచుతుందని చెబుతున్నారు.

News December 3, 2025

‘గుర్తొ’చ్చింది.. గుర్తుంచుకోండి!

image

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు మరో వారమే(DEC 11) ఉంది. తాజాగా అభ్యర్థులకు SEC సింబల్స్ కేటాయించింది. దీంతో ‘‘గుర్తు’ గుర్తుంచుకో.. అన్నా గుర్తుంచుకో’ అంటూ ఇంటింటి ప్రచారానికి సిద్ధమవుతున్నారు. పార్టీలను పక్కనపెట్టి అభివృద్ధి చేసేందుకు ‘ఒక్క ఛాన్స్’ అంటూ వేడుకుంటున్నారు. ఇప్పుడు ఓటర్లు తమ వజ్రాయుధాన్ని సద్వినియోగం చేసే టైమొచ్చింది. సమర్థులైన అభ్యర్థికే ఓటు వేయాలని తప్పక గుర్తుంచుకోండి.

News December 3, 2025

‘టీ’ దోమతో జీడి మామిడి తోటల్లో కలిగే నష్టం

image

రాత్రి ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతున్న తరుణంలో జీడిమామిడి తోటల్లో టీ-దోమ ముప్పు పెరుగుతోంది. దీని వల్ల పంట ఉత్పత్తిలో సుమారు 30-40% నష్టపోయే ప్రమాదం ఉంది. టీ దోమలు చెట్టు లేత కొమ్మలు, పూత రెమ్మలను ఆశించి రసాన్ని పీలుస్తాయి. పూత రెమ్మలను ఆశిస్తే పూత మాడి, చెట్టు కాలినట్లు కనిపిస్తుంది. కొత్త కొమ్మలు, రెమ్మలపై ఆశిస్తే చెట్టు అభివృద్ధి క్షీణిస్తుంది. గింజలను ఆశిస్తే గింజలు వడిలి, తొలిదశలోనే రాలిపోతాయి.