News March 12, 2025
బాబూ.. నీకిదే తొలి హెచ్చరిక: జగన్

AP: వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘యువత పోరు’ను పోలీసుల ద్వారా అణగదొక్కడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి చంద్రబాబుకు ఇదే తొలి హెచ్చరిక అన్నారు. ‘విద్యార్థుల కోసం మా ప్రభుత్వం విద్యాదీవెన, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, అమ్మఒడి పథకాలు ఇచ్చింది. కానీ చంద్రబాబు తన పాలనతో మళ్లీ చీకటి రోజులు తెస్తున్నారు’ అంటూ ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News January 3, 2026
ASF జిల్లా సర్పంచులకు శిక్షణ

ఆసిఫాబాద్ జిల్లాలోని సర్పంచులకు 2026 సంవత్సరానికి సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించన్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు. జనవరి 6 నుంచి 12వ తేదీ వరకు యోగా, కళా మేళా, మానసిక శిక్షణ, పర్యటన, లక్ష్యసాధన, సేవా భావం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సర్పంచులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.
News January 3, 2026
కాళేశ్వరంపై మోజు.. పాలమూరుపై నిర్లక్ష్యం: ఉత్తమ్

TG: మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై అధిక మోజు చూపి, కావాలనే పాలమూరు-రంగారెడ్డిని నిర్లక్ష్యం చేశారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. ‘జూరాల నుంచి అయితే రోజుకు 2.8 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 121 టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉండేది. కానీ సోర్స్‌ను జూరాల నుంచి కాకుండా శ్రీశైలానికి మార్చడం వల్ల కేవలం 68 టీఎంసీలే తీసుకునేలా చేశారు. దీని వల్ల అంచనా వ్యయం రూ.85వేల కోట్లకు చేరింది’ అని తెలిపారు.
News January 3, 2026
చుక్క నీటిని వదులుకోం: ఉత్తమ్ కుమార్

TG: కృష్ణాజలాల్లో చుక్క నీటిని కూడా వదులుకోబోమని అసెంబ్లీలో PPT సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో నీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 99శాతం చేశామన్న కేసీఆర్ వ్యాఖ్యలు అబద్ధమని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాకే ప్రాజెక్టు పనులు పునరుద్ధరించినట్లు చెప్పారు.


