News March 8, 2025
ఎక్కువ మంది పిల్లలను కనమంటున్న బాబు.. మీ కామెంట్?

ఎక్కువ మంది పిల్లలను కనండి అని విస్తృత ప్రచారం చేస్తున్న CM చంద్రబాబు అందుకోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా ఉద్యోగులు ఎంత మంది పిల్లలను కన్నా అన్ని కాన్పులకూ ప్రసూతి సెలవులు ఇస్తామన్నారు. దీంతో వారికి 6 నెలల చొప్పున జీతంతో కూడిన సెలవులు రానున్నాయి. గతంలో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులు. దాన్నీ తొలగించి చట్టంలో మార్పులు చేశారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News November 17, 2025
తుని మున్సిపల్ ఛైర్పర్సన్ ఫోన్ హ్యాక్

తుని మున్సిపల్ ఛైర్పర్సన్ నార్ల భువన సుందరి ఫోన్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ఆమె మొబైల్ ఫోన్లోని కాంటాక్ట్స్కి సందేశాలు పంపిస్తూ డబ్బులు పంపించాలని కోరుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై భువన సుందరి స్పందిస్తూ.. తమ పేరుతో వచ్చే ఎలాంటి సందేశాలకు స్పందించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డబ్బులు పంపించి ఎవరూ మోసపోవద్దన్నారు.
News November 17, 2025
చిత్తూరు కలెక్టరేట్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. కార్యాలయాల చుట్టూ తిరిగిన తన భూ సమస్యకు పరిష్కారం దొరకలేదంటూ వి.కోట(M) మిట్టూరుకు చెందిన నందిని పురుగుల మందు తాగింది. అక్కడున్న మహిళా పోలీసులు వెంటనే స్పందించారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 17, 2025
సౌదీ ప్రమాదంలో భారతీయులు చనిపోవడం బాధాకరం: మోదీ

సౌదీ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మదీనాలో జరిగిన ఈ ఘటనలో భారత పౌరులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. రియాద్లోని భారత రాయబార కార్యాలయం & జెడ్డాలోని కాన్సులేట్ సాధ్యమైనంత సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. సౌదీ అధికారులతో సమీక్షిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.


