News March 28, 2024

బాబు చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణం: జగన్

image

AP: చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటీ లేదని సీఎం జగన్ అన్నారు. ‘బాబు చరిత్ర చూస్తే ఏముంది గర్వకారణం. బాబు పార్టీ కార్యకర్తలు చెప్పుకునేందుకు ఏమున్నది గర్వకారణం. బాబు కూటమి చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణం. అందరూ ఆలోచన చేయాలి. వీరు ఈ రాష్ట్రానికి ఏం మంచి చేశారని మళ్లీ మన ముందుకు వస్తున్నారు? బాబు పేరు చెబితే బషీర్‌బాగ్ కాల్పులు, కరవు కాటకాలు గుర్తొస్తాయి’ అని విమర్శించారు.

Similar News

News April 11, 2026

రేపు ఉ.11 గంటలకు ఇంటర్ ఫలితాలు

image

తెలంగాణ ఇంటర్ ఫలితాలను రేపు ఉ.11 గంటలకు విడుదల చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. హైదరాబాద్‌లోని TGBIE భవనంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఉన్నతాధికారులు పాల్గొంటారని తెలిపింది.
* రేపు ఒక్క క్లిక్‌తో అందరి కంటే వేగంగా Way2Newsలో రిజల్ట్స్‌ను తెలుసుకోండి.

News April 11, 2026

మా ‘స్వీటెస్ట్’ ఆయిల్ కొనేందుకు పోటెత్తుతున్నారు: ట్రంప్

image

అమెరికన్ క్రూడ్ ఆయిల్ కొనేందుకు భారీ ట్యాంకర్లు తరలివస్తున్నాయని ట్రంప్ అన్నారు. వీటికి ఆయిల్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సౌదీ, రష్యాల కంటే తమ వద్ద ఎక్కువ నిల్వలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. US క్రూడ్‌ ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైనదన్న ట్రంప్.. ఇది స్వీటెస్ట్‌ ఆయిల్ అని పేర్కొన్నారు. హార్ముజ్ రీఓపెనింగ్‌పై పాక్‌లో ఇరాన్-US మధ్య చర్చలు జరగనున్న వేళ ట్రంప్ ఈ పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.

News April 11, 2026

మృతుడి ‘ఆధార్’ను డీయాక్టివేట్ ఎలా చేయాలి?

image

ఎవరైనా చనిపోయాక వారి ఆధార్‌ను డీయాక్టివేట్ చేయడం ముఖ్యం. లేదంటే ఆ నంబర్ ఆధారంగా దుండగులు సైబర్ నేరాలకు పాల్పడే అవకాశం ఉంది.
✒ https://myaadhaar.uidai.gov.in/లోకి వెళ్లి కుటుంబీకుల్లోని ఒకరి ఆధార్‌తో లాగిన్ అవ్వాలి.
✒ ‘రిపోర్ట్ డెత్ ఆఫ్ ఎ ఫ్యామిలీ నంబర్’ ఆప్షన్‌ను ఎంచుకొని మృతుడి వివరాలు నమోదు చేయాలి.
✒ డెత్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేసి, సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది.
#ShareIt