News August 2, 2024

రైళ్లలో బేబీ బెర్తులు: కేంద్ర రైల్వేమంత్రి

image

రైళ్లలో తల్లుల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చేందుకు బేబీ బెర్తులను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో వెల్లడించారు. ‘లక్నో మెయిల్‌లోని ఒక కోచ్‌లో 2 బేబీ బెర్తులను అమర్చాం. దీనిపై ప్రశంసలొచ్చాయి. సామాన్లు పెట్టుకునే స్థలం తగ్గడం వంటి సమస్యలు మా దృష్టికొచ్చాయి. ప్యాసింజర్ కోచ్‌లలో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి’ అని BJP MP అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.

Similar News

News November 25, 2025

కడప కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సప్ ఖాతా.. తస్మాత్ జాగ్రత్త

image

కడప కలెక్టర్ పేరు మీద నకిలీ నంబర్‌తో వాట్సప్ ఖాతాను సృష్టించి మోసాలకు పాల్పడుతున్న వారిని ప్రజలు నమ్మవద్దని కలెక్టర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గుర్తుతెలియని వ్యక్తి కలెక్టర్ పేరుతో వాట్సప్ ఖాతాను క్రియేట్ చేసినట్లు తమ కార్యాలయ దృష్టికి వచ్చిందన్నారు. ఆ ఖాతా కలెక్టర్‌ది కాదని సృష్టం చేశారు. కలెక్టర్ ఫొటోలు వాడి మోసం చేసేందుకు ప్రయత్నాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

News November 25, 2025

హీరోల రెమ్యునరేషన్ తగ్గిస్తే టికెట్ రేట్లు ఎందుకు పెరుగుతాయ్?

image

సినిమా టికెట్ రేట్ల పెరుగుదలకు టాప్ హీరోల రెమ్యునరేషనే ప్రధాన కారణమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అగ్ర హీరోలు ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు తీసుకుంటున్నారు. దీనివల్లే బడ్జెట్ పెరుగుతోందని, పెట్టిన డబ్బులు రాబట్టేందుకు నిర్మాతలు ప్రేక్షకులపై టికెట్ల భారం మోపుతున్నారని చెబుతున్నారు. అలాగే థియేటర్లలో స్నాక్స్ రేట్లను కంట్రోల్ చేయాలని సూచిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News November 25, 2025

శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకారం?

image

రష్యాతో పీస్ డీల్‌కు ఉక్రెయిన్ అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ‘కొన్ని చిన్న సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. కానీ ఉక్రెయిన్ ప్రభుత్వం శాంతి ఒప్పందానికి సూత్రప్రాయంగా ఓకే చెప్పింది’ అని అమెరికా అధికారులు తెలిపినట్లు పేర్కొంది. అయితే చర్చలు కొనసాగుతున్నాయని, ఖరారు కాలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పడం గమనార్హం. ప్రస్తుతం అబుదాబిలో US, రష్యా బృందాలు చర్చలు జరుపుతున్నాయి.