News April 29, 2024
‘బేబీ వస్తోంది’.. సాక్షి ధోనీ పోస్ట్ వైరల్

ఎంఎస్ ధోనీ సతీమణి సాక్షి ధోనీ ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌గా మారింది. నిన్న మ్యాచ్ సందర్భంగా ఆమె ‘బేబీ వస్తోంది. మ్యాచ్‌ను త్వరగా ముగించండి. కాబోయే అత్తగా నా రిక్వెస్ట్’ అని ఇన్‌స్టా స్టోరీ పెట్టారు. దీంతో ధోనీ మామ కాబోతున్నాడంటూ ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. నిన్నటి మ్యాచ్‌లో హైదరాబాద్‌పై చెన్నై 78 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
Similar News
News October 22, 2025
రష్మిక ‘థామా’ తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?

రష్మిక-ఆయుష్మాన్ ఖురానా లీడ్ రోల్స్‌లో ఆదిత్య సర్పోదర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘థామా’ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. వ్యాంపైర్ థీమ్ కావడంతో ఆడియన్స్‌లో మూవీపై అంచనాలు పెరిగాయి. దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్‌పై ఆసక్తి నెలకొంది. ఈ మూవీ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.25.11 కోట్లు కలెక్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది ధమాకా విజయమని నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్ పేర్కొంది.
News October 22, 2025
గాయిటర్ గురించి తెలుసా?

థైరాయిడ్ గ్రంథి అసాధారణ సైజుకు పెరగడాన్ని గాయిటర్ అంటారు. ఇది రెండు రకాలు. థైరాయిడ్ గ్రంథి ఉబ్బడాన్ని డిఫ్యూస్ గాయిటర్ అని, థైరాయిడ్ గ్రంథిలో గడ్డలు పెరిగితే నాడ్యులార్ గాయిటర్ అని అంటారు. గొంతు దగ్గర బాగా ఉబ్బినట్లుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కొందరిలో మాత్రం థైరాయిడ్ హార్మోన్ల స్రావంలో హెచ్చుతగ్గులు వస్తాయి. నిర్ధారణ కోసం థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్షలైన T3, T4, TSH, NFAC చేస్తారు.
News October 22, 2025
గాయిటర్ చికిత్స

థైరాయిడ్ గ్రంథి అయోడిన్‌ను గ్రహించి దాన్ని థైరాయిడ్ హార్మోన్లుగా మారుస్తుంది. అయోడిన్ లోపిస్తే గాయిటర్ జబ్బు వస్తుంది. థైరాయిడ్ సమస్య నిర్ధారణ కోసం చేసే పరీక్షల ఫలితాల ఆధారంగా గాయిటర్ చికిత్సకు ఎండోక్రైనాలజిస్ట్ ఆధ్వర్యంలో తగిన చికిత్స చేస్తారు. థైరాయిడ్ వ్యవస్థను సరిచేయడం ద్వారా కొంతమందిలో గాయిటర్ తగ్గుముఖం పడుతుంది. సాధారణంగా దీన్ని ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండానే నయం చేయవచ్చు.