News January 6, 2025
9న ఓటీటీలోకి ‘బచ్చలమల్లి’?
అల్లరి నరేశ్ నటించిన ‘బచ్చలమల్లి’ గతేడాది డిసెంబర్ 20న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈనెల 9న అమెజాన్ ప్రైమ్‌లో చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహించిన ఈ మూవీలో అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించారు.
Similar News
News January 7, 2025
కాంగ్రెస్ కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ వార్నింగ్
TG: యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. నిరసనలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలన్నారు. బీజేపీ నేతల వ్యాఖ్యలు ఖండించాల్సినవేనని, అయితే పార్టీ కార్యాలయంపై దాడి సరికాదన్నారు. మరోవైపు బీజేపీ నేతలు ఇలా దాడులు చేయడం సరికాదని హితవు పలికారు. శాంతిభద్రతల సమస్యలు రాకుండా బీజేపీ సహకరించాలని కోరారు.
News January 7, 2025
Stock Market: కొంత ఊరట దక్కింది
గత సెషన్లో ఎదురైన భారీ నష్టాల నుంచి దేశీయ బెంచ్ మార్క్ సూచీలు కోలుకుంటున్నట్టు కనిపిస్తున్నాయి. మంగళవారం Sensex 234 పాయింట్ల లాభంతో 78,199 వద్ద, Nifty 91 పాయింట్లు ఎగసి 23,707 వద్ద స్థిరపడ్డాయి. మెటల్, మీడియా, బ్యాంకు, ఫైనాన్స్, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాలు రాణించడంతో ఇన్వెస్టర్లకు భారీ నష్టాల నుంచి కొంత ఊరట దక్కినట్టైంది. ONGC, SBI Life, HDFC Life టాప్ గెయినర్స్.
News January 7, 2025
ఎవరు లబ్ధి పొందారో తెలియాలి: హైకోర్టు జడ్జి
TG: KTR క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ జారీ చేసిన ఆర్డర్ కాపీలో జడ్జి కీలక అంశాలను ప్రస్తావించారు. HMDA పరిధికి మించి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిందని, క్యాబినెట్ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాలని అభిప్రాయపడ్డారు. KTR ఆదేశాలతోనే చెల్లింపులు జరిగాయని ప్రభుత్వం అంటోందని, చెల్లింపులతో ఎవరు లబ్ధి పొందారో తెలియాలని జడ్జి పేర్కొన్నారు. అంతిమ లబ్ధిదారులెవరో బయటపడాలని తీర్పు కాపీలో వెల్లడించారు.