News December 10, 2024
కాలుష్యాన్ని నియంత్రించే బ్యాక్టీరియా.. IIT గువాహటి శాస్త్రవేత్తల ఆవిష్కరణ

బ్యాక్టీరియా ద్వారా మీథేన్, కార్బన్ డయాక్సైడ్ను శుద్ధమైన బయోఫ్యూయల్గా మార్చే విధానాన్ని IIT గువాహటి శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. Prof.దేవాశిష్, కళ్యాణి సాహు బృందం ఆవిష్కరించిన ఈ విధానం ద్వారా మెథానోట్రోఫిక్ బ్యాక్టీరియా కాలుష్య కారకాలను శుద్ధిచేస్తుంది. ప్రయోగ దశలో ఉన్న ఈ నమూనా ప్రస్తుతం 5L పరిమాణంలో ఉంది. పర్యావరణ అనుకూల ఇంధన ఆవిష్కరణలో ఇది కీలక ముందడుగని వారు పేర్కొన్నారు.
Similar News
News September 1, 2025
కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింపు

దేశ వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. 19 కేజీల సిలిండర్ ధరను రూ.51.50 తగ్గించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ రేట్ రూ.1,580కి చేరింది. తగ్గించిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. అటు గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
News September 1, 2025
ఈనెల 7న చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు చూడొచ్చా?

ఈనెల 7న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. కర్కాటక, కుంభ రాశుల వారు ఈ గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ‘ఒక వేళ గ్రహణాన్ని వీక్షిస్తే అకారణంగా గొడవలు, వ్యక్తిగత సమస్యలు, ఆందోళన తలెత్తుతాయి. ఈ రెండు రాశుల వారు గ్రహణం పూర్తయ్యాక చంద్రుడికి అభిషేకం చేయాలి. రాహు గ్రహానికి పూజలు చేయాలి. అలాగే పేదలకు ధన సహాయం చేస్తే మంచిది’ అని వారు అంటున్నారు.
News September 1, 2025
నేడు రాజంపేటలో సీఎం పర్యటన.. పెన్షన్ల పంపిణీ

AP: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఇవాళ ఉదయం ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 63,61,380 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.2,746 కోట్ల నిధులను రిలీజ్ చేసింది. సీఎం చంద్రబాబు ఇవాళ అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కె.బోయినపల్లిలో పెన్షన్లు పంపిణీ చేసిన అనంతరం తాళ్లపాక గ్రామంలో లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడుతారు. వారి సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు.