News December 10, 2024
ప్రవర్తన బాగాలేదు: ప్రతిపక్షాలకు LS స్పీకర్ వార్నింగ్

పార్లమెంటు నడుస్తున్న తీరుపై లోక్సభ స్పీకర్ ఓంబిర్లా అసహనం చెందారు. చర్చలు జరగకుండా వాయిదాలు పడుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో కొందరి ప్రవర్తన నిరాశపరుస్తోందని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. ఇది ప్రజల ఆకాంక్షలు, ఆశయాలను నెరవేర్చాలి. మనమంతా సభా మర్యాదను పాటించాలి. కానీ కొన్ని రోజులుగా అంత మంచివి కాని ఘటనలు చూస్తున్నా’ అని పేర్కొన్నారు.
Similar News
News November 23, 2025
ఆశపడి వెల్లుల్లితిన్నా రోగం అట్లాగే ఉందట

వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదని, కొన్ని రోగాలను నయం చేస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఆ ఘాటును భరించి తిన్నా ఎలాంటి మార్పు లేకపోతే నిరాశే ఎదురవుతుంది. అలాగే ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో ప్రయాసపడి, కష్టపడి ప్రయత్నించినప్పటికీ, చివరికి ఫలితం శూన్యమైనప్పుడు లేదా పరిస్థితిలో పురోగతి లేనప్పుడు ఈ సామెతను సందర్భోచితంగా వాడతారు.
News November 23, 2025
దీపంలో వత్తి పూర్తిగా కాలిపోతే అశుభమా?

దీపంలో వత్తి పూర్తిగా కాలిపోవడం ఎలాంటి అశుభానికి సంకేతం కాదని పండితులు చెబుతున్నారు. వత్తి పూర్తిగా కాలిపోవడం, దీపం మధ్యలోనే ఆగిపోవడం అనేవి భౌతిక కారణాల వల్ల మాత్రమే జరుగుతుందని అంటున్నారు. ‘వీటికి దైవిక దోషాలు, ఎలాంటి అశుభ కారణాలు లేవు. దీపం ఎప్పుడూ సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది. కాబట్టి ఈ పరిణామాల వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉండవు. భయపడవలసిన అవసరం లేదు’ అని వివరిస్తున్నారు.
News November 23, 2025
57 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన ఏనుగు

MPలోని పన్నా టైగర్ రిజర్వులో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. 57 ఏళ్ల అనార్కలి అనే ఏనుగు కవలలకు జన్మనివ్వడంతో అడవి సిబ్బంది, వన్యప్రాణి ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఏనుగు ఒక్క పిల్లకే జన్మనిస్తుంది. కానీ పన్నా చరిత్రలో తొలిసారిగా 3 గంటల వ్యవధిలో 2 పిల్లలు పుట్టాయి. దీంతో ఈ టైగర్ రిజర్వులో ఏనుగుల సంఖ్య 21కు చేరింది. గత 39 ఏళ్లలో పన్నాలో ఈ ఏనుగు ఇప్పటివరకు ఆరు సార్లు ప్రసవించింది.


