News October 26, 2024
టీమ్ ఇండియాకు బ్యాడ్ డేస్

గత రెండు వారాల్లోనే భారత పురుషుల జట్టు, మహిళల, యువకుల జట్లు ఘోర పరాజయాలు ఎదుర్కొన్నాయి. కివీస్‌పై మెన్స్ టీమ్ 36 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ కోల్పోయింది. ఆసియా కప్‌లో ఉమెన్స్ టీమ్ సెమీ ఫైనల్‌కు వెళ్లలేకపోయింది. దుబాయ్‌లో జరిగిన ఎమర్జింగ్ టోర్నీ సెమీ ఫైనల్లో పసికూన అఫ్గానిస్థాన్‌పై భారత యువ జట్టు ఓడి ఫైనల్‌కు చేరలేకపోయింది. దీంతో భారత జట్టుకు ఇవి మంచి రోజులు కావంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
Similar News
News January 15, 2026
NIA కొత్త సారథిగా రాకేశ్ అగర్వాల్ నియామకం

కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ (ACC) కీలక భద్రతా విభాగాలకు కొత్త చీఫ్‌లను నియమించింది. 1994 బ్యాచ్ IPL అధికారి రాకేశ్ అగర్వాల్ జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) డైరెక్టర్ జనరల్‌గా నియామకం అయ్యారు. ఆయన పదవీకాలం 2028 ఆగస్టు వరకు కొనసాగనుంది. మరోవైపు హరియాణా మాజీ DGP శత్రుజీత్ సింగ్ కపూర్‌ను ITBP డీజీగా నియమించింది. ప్రస్తుతం ఐటీబీపీ డీజీగా ఉన్న ప్రవీణ్‌కుమార్‌కు బీఎస్ఎఫ్ DGగా బాధ్యతలు అప్పగించింది.
News January 15, 2026
ట్రంప్ ఆదేశిస్తే ఇరాన్‌పై దాడి ఖాయం!

ఇరాన్‌పై దాడి చేసే పలు మార్గాలను అమెరికా పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయంగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశిస్తే ఏ క్షణమైనా దాడి జరగొచ్చని తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా అమెరికా సైనిక స్థావరాల నుంచి వైమానిక దాడులు, సముద్ర మార్గం ద్వారా క్షిపణి దాడులు, డ్రోన్ దాడులు, సైబర్ వార్, సీక్రెట్ ఆపరేషన్ లేదా కీలక మౌలిక సదుపాయాలపై దాడులు వంటి ఆప్షన్లు ఉన్నట్లు సమాచారం.
News January 15, 2026
హైదరాబాద్ కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్

రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ సెకండ్ ఫేజ్ మ్యాచ్‌లకు హైదరాబాద్ కెప్టెన్‌గా టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 15 మందితో కూడిన టీమ్‌ను ప్రకటించింది. జనవరి 22న ముంబై, 29న ఛత్తీస్‌గఢ్‌తో జరిగే మ్యాచ్‌లలో సిరాజ్ జట్టును నడిపించనున్నారు. రాహుల్ సింగ్‌ను VCగా ఎంపిక చేశారు. VHTలో డబుల్ సెంచరీతో చెలరేగిన అమన్‌రావ్ పేరాల సైతం జట్టులో ఉన్నారు.


